వర్షాలపై ఐఎండీ గుడ్ న్యూస్

Monsoon 2024: నైరుతి రుతుపవనాల రాక ప్రభావం కనిపిస్తోంది. ఈ సీజన్‌లో సకాలంలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అంచనా వేసిన దానికంటే ఒక రోజు ముందే అంటే ఈ నెల 31వ తేదీ నాటికి అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే వాతావరణం కేంద్రం అంచనా వేసింది. అనంతరం రెండు వారాల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తాయి.

దీనికి అనుగుణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కూడా. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంత జిల్లాల్లో ఆశించిన స్థాయికంటే అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తోంది. జూన్ మొదటి వారంలో ఏపీ, తెలంగాణపై రుతుపవనాల ప్రభావం ఉండొచ్చంటూ వాతావరణ శాఖ అంచనా వేసింది.

Monsoon 2024 Rainfall over the country is likely to be 106 percent of the lpa

ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయనే విషయంపై వాతావరణ కేంద్రం తన తాజా అంచనాలను వెల్లడించింది. దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ సారి వర్షాలకు ఎలాంటి లోటూ ఉండబోదని భరోసా ఇచ్చింది.

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా లాంగ్ పీరియడ్ యావరేజ్‌లో సాధారణం కంటే ఎక్కువ.. అంటే- 106 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వర్షపాతంపై తాము వేసిన అంచనాల్లో నాలుగు శాతం మేర తేడా ఉండొచ్చని పేర్కొన్నారు.

జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్.. మధ్యకాలంలో ఆశించిన దాని కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు మృత్యుంజయ మహాపాత్ర. నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, అనంతరం అవి చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఉందని అంచనా వేసినట్లు వెల్లడించారు. జూన్ 10- 15 తేదీల మధ్య రుతుపవనాలు విస్తరిస్తాయని అన్నారు.

లాంగ్ పీరియడ్ యావరేజ్‌లో 90 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైతే దాన్ని లోటుగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేవని మహాపాత్ర చెప్పారు. లోటు వర్షపాతం నమోదు కావడానికి రెండు శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. 90- 95 శాతం మధ్య కురిస్తే దాన్ని సగటు కంటే తక్కువ వర్షపాతంగా గుర్తిస్తారు.

96 నుంచి 104 శాతం వరకు వర్షాలు కురిస్తే దాన్ని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. 105 నుంచి 110 శాతం వరకు వర్షాలు కురిస్తే సగటు కంటే అధికంగా, 110 కంటే ఎక్కువగా ఉంటే అధిక వర్షపాతంగా వాతావరణ శాఖ అధికారులు లెక్కిస్తారు. ప్రస్తుతం 106 శాతం వరకు వర్షపాతం నమోదవుతుందని మహాపాత్ర వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+