వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుతుపవనాలు: దక్షిణ కొంకణ్, గోవాలో భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జూన్ 9న రుతుపవనాల రాకతో ముంబైలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

 Monsoon update: Heavy rainfall likely over south Konkan, Goa today

కాగా, భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం... నైరుతి రుతుపవనాల కారణంగా సెంట్రల్ ఆరేబియా సముద్రం, కొంకణ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, విదర్బా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాళఖాతం ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నైరుతి రుతుపవనాలతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో రాబోయే 48గంటల్లో మంచి వర్షాలు కురుస్తాయి. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా రాబోయే 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 Monsoon update: Heavy rainfall likely over south Konkan, Goa today

దక్షిణ కొంకణ్ గోవా, ఉత్తర కొంకణ్ గోవా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, విదర్బా, గ్యాంగ్టక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటితోపాటు కర్ణాటక కోస్తా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అస్సాం, మేఘాలయ, ఒడిశా, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఛండీఘర్, ఢిల్లీ, తూర్పురాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చలిగాలులు వీచే అవకాశాలున్నాయి.

English summary
After much speculations, Mumbai Monsoon 2018 has finally arrived on June 9. Moderate to heavy rains have been lashing the city since Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X