వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ రిపోర్ట్: కొంకణ్, గోవాలో భారీ వర్షాలు, ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగాళాఖాతం మీదుగా రుతుపవనాల పశ్చిమం వైపు పయనిస్తున్నాయి. అనూప్‌గడ్, హిసార్, మీరట్, బహ్రెయిచ్, హిమాలయా పాద ప్రాంతాల్లో రుతుపవనాలు ఆవరించాయి.

Recommended Video

2017 కంటే కూడా ఈ ఏడాది వర్షాలు బాగా కురవనున్నాయి: ఐఎండీ

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్, కర్నల్, బరేలీ, బహ్రెయిచ్, హజరీబాగ్, బాలసోర్, మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Monsoon update: Heavy rains likely over Konkan, Goa

ఉపరితలంలో ఏర్పడిన తుఫాను కారణంగా దక్షిణ బంగ్లాదేశ్ తోపాటు ఒడిశా, పరిసర తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, ఉత్తర పెనిన్సూలర్ ఇండియాలో ఈ రోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది.

ఐఎండీ అంచనాల ప్రకారం కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, గుజరాత్, మరఠ్వాడా, తెలంగాణ, కర్ణాటకలో భారీ వర్షాల కురుస్తాయి.

తమిళనాడు, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది.

గుజరాత్ తీర ప్రాంతంలో ఆరేబియా సముద్రం కొంత అలజడిగా మారనుంది. మరో నాలుగు రోజులపాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది.

English summary
The axis of Monsoon trough has shifted in the wake of the formation of the system in the Bay of Bengal. Now, the western part of the trough is passing through Anupgarh, Hisar, Meerut, Bahraich while the eastern arm continues to lie close to the foothills of the Himalayas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X