తల్లి కర్కశం : ప్రియుడితో కూతురు పెళ్లి డ్రామా...!

మానవ సంబంధాలు మంటలో కలిసే మరో సంఘటన తమిళనాడులో జరిగింది. స్వంత పిల్లలు అని కూడ చూడకుండా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మానవ సంబంధాలు ఎటువైపు వెళుతున్నాయనే ప్రశ్న ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో ఉత్పన్నమవుతోంది.ఈ నేపథ్యంలోనే తమిళనాడు తంజావూరు జిల్లాకు చెందిన ఓ మహిళ తాను తప్పు చేయడమే కాకుండా దాన్ని తన కూతురుకు కూడ అంటగట్టాలని చూసింది.

ప్రేమించాడాని యువకుడిపై ఫిర్యాదు చేసిన యువతి

ప్రేమించాడాని యువకుడిపై ఫిర్యాదు చేసిన యువతి

తమిళనాడు లోని తంజావూరు జిల్లా తిరువయ్యారు సమీపంలో నివసిస్తున్న ఓ మధ్యవయస్కురాలైన మహిళ కూతురుతో కలిసి నివసిస్తోంది. మహిళకు తిరువయ్యూరు సమీపంలోని సమీప గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమే అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. అయితే ఇటివల ఆ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఎలాగైన యువకుడిని వదలిపెట్టవద్దని మహిళ ప్లాన్ వేసింది. పెళ్లి అయిన అనంతరం అక్రమ సంబంధం కొనసాగించేందుకు అవకాశం ఉండదని భావించింది.

యువకుడి మోజులో పడిన తల్లీ

యువకుడి మోజులో పడిన తల్లీ

ఈ నేపథ్యంలోనే యువకుడి పెళ్లిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించింది. దీంతో తన కూతురును రంగంలోకి దింపింది. తన కూతురును ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తే తన అక్రమ సంబంధం కూడ సాఫిగా కొనసాగవచ్చనే నీచమైన అలోచన చేసింది. అనుకొన్నదే తడవుగా తంజావూరు ఎస్పీ కార్యాలయంలో కూతురు చేత యువకుడిపై ఫిర్యాదు చేయింది. యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కోంది. నాటకాన్ని రక్కికట్టించేందుకు యువతి పోలీస్ స్టేషన్‌‌లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు యువతి ఆత్మహత్య చేసుకునేప్పుడు తల్లి కూడ పక్కనే ఉంది.

పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్న పెళ్లికొడుకు

పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్న పెళ్లికొడుకు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లీ చేసుకోబోతున్న యువకున్ని తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇక విచారణలో యువకుడు ఉన్న విషయాన్ని చెప్పాడు. తాను యువతిని ప్రేమించలేదని స్పష్టం చేశాడు. అయితే తల్లితో మాత్రం అక్రమ సంబంధం ఉందని కుండ బద్దలు కొట్టాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు విషయాన్ని అక్కడే ఉన్న యువతికి చెప్పారు. దీంతో యువతి కేసును వాపసు తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం యువతి తల్లిని తీసుకువచ్చి మందలించారు. దీంతో తన కుమార్తెను ప్రియుడికి ఇచ్చి చేస్తే తనకు కూడ అనుకూలంగా ఉంటుందని భావించానని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మరోవైపు అప్పటికే పెళ్లి నిశ్చయమైన యువకుడి పెళ్లి కూడ సజావుగా సాగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+