అత్తను చాకచక్యంగా కిడ్నాప్ చేసిన కిలాడీ కోడలు, ఆస్తుల కోసం పక్కాప్లాన్, యువకుడితో !

చెన్నై: కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అత్తను చాకచక్యంగా కిడ్నాప్ చేసిన కోడలను తమిళనాడులోని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అత్తను కిడ్నాప్ చెయ్యడానికి సహకరించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అత్తను కిడ్నాప్ చెయ్యడానికి, అమెను బెదిరించడానికి ఇంకా ఎవరైనా సహకరించారా అంటూ చెన్నై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 సోదరి ఇంటిలో !

సోదరి ఇంటిలో !

చెన్నైలోని తాంబరం సమీపంలోని పడప్పైకి చెందిన పద్మిని ఐనావరం నారాయణ మేస్త్రీలోని ఆమె అక్క సరస్వతి ఇంటిలో నివాసం ఉంటోంది. మేనకకు ఆమె అత్త పద్మినికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ విషయంపై అత్త పద్మినికి, మేనకకు చాల సార్లు గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేదు.

కారులో కిడ్నాప్

కారులో కిడ్నాప్

మంగళవారం సాయంత్రం మేనక కారులో ఐనావరంకు వెళ్లింది. తరువాత అక్కడ నివాసం ఉంటున్న అత్త పద్మినిని మేనక, ఆమె వెంట వెళ్లిన యువకుడు కారులో కిడ్నాప్ చేశారు. తరువాత అత్త పద్మినిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన మేనక ఆమెను నిర్బంధించింది.

 పోలీసు కేసు పెట్టిన సరస్వతి

పోలీసు కేసు పెట్టిన సరస్వతి

తన సోదరి పద్మినిని ఆమె కోడలు మేనక కిడ్నాప్ చేసిందని సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్ పెక్టర్ నటరాజన్ విచారణ చేశారు. తిరునింద్రయూర్ సమీపంలోని తన బంధువు ఇంటిలో పద్మినిని ఆమె కోడలు నిర్బంధించిదని పోలీసులు గుర్తించారు.

 కిలాడీ కోడలు

కిలాడీ కోడలు

పోలీసులు నేరుగా తిరునింద్రయూర్ సమీపంలోని ఇంటికి వెళ్లి అక్కడ పద్మిని ఉన్న విషయం గుర్తించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. పద్మిని ఇచ్చిన సమాచారం మేరకు ఆమె కోడలు మేనకను పోలీసులు అరెస్టు చేశారు. పద్మినిని కిడ్నాప్ చెయ్యడానికి మేనకకు ఓ యువకుడు సహకరించాడని వెలుగు చూడటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి గొడవల కారణంగా పద్మినిని కిడ్నాప్ చేశానని మేనక అంగీకరించిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+