Daughter: తల్లి ప్రాణం తీసిన కూతురి వాట్సాప్ స్టేటస్, కాలేజ్ అమ్మాయిల గొడవతో, హత్య !

ముంబాయి: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ప్రతిరోజూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం అలవాటు. ఎప్పటిలాగే కాలేజ్ అమ్మాయి ఆమె వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న ఆమె స్నేహితురాలు వాట్సాప్ స్టేటస్ చూసింది. అంతే కాలేజ్ అమ్మాయి స్నేహితురాలు తన గురించి తప్పుగా ప్రచారం చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పక్కంటి అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లి నీ వాట్సాప్ స్టేటస్ లో ఎందుకు తప్పుగా మెసేజ్ పోస్టు చేశావని గొడవకు దిగారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మద్య కాలేజ్ అమ్మాయి ఇంట్లో పెద్దగా గొడవ జరిగింది. ఆ సందర్బంలో జరిగిన గొడవ, దాడి కారణంగా కాలేజ్ అమ్మాయి తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

 కాలేజ్ అమ్మాయికి వాట్సాప్ స్టేటస్ అలవాటు

కాలేజ్ అమ్మాయికి వాట్సాప్ స్టేటస్ అలవాటు

మహారాష్ట్రలోని బల్కర్ సమీపంలోని శివాజీనగర్ లో 20 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ప్రతిరోజూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం అలవాటు. తన మొబైల్ ఫోన్ లో పెట్టిన వాట్సాప్ స్టేటస్ ను ఎంత మంది చూశారు, ఎందరు స్పందించారు అని చూసుకోవడం ఆ అమ్మాయికి అలవాటు.

 పక్కింటి అమ్మాయికి మండిపోయింది

పక్కింటి అమ్మాయికి మండిపోయింది

ఎప్పటిలాగే కాలేజ్ అమ్మాయి ఆమె వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు వాట్సాప్ స్టేటస్ చూసింది. అంతే కాలేజ్ అమ్మాయి స్నేహితురాలు తన గురించి తప్పుగా ప్రచారం చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.

 తల్లికి తీవ్రగాయాలు

తల్లికి తీవ్రగాయాలు

పక్కంటి అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లి నీ వాట్సాప్ స్టేటస్ లో ఎందుకు తప్పుగా మెసేజ్ పోస్టు చేశావని గొడవకు దిగారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మద్య కాలేజ్ అమ్మాయి ఇంట్లో పెద్దగా గొడవ జరిగింది. ఆ సందర్బంలో కాలేజ్ అమ్మాయి తల్లి లీలావతి దేవి (48) అనే మహిళ మీద సమీపంలో నివాసం ఉంటున్న వారు దాడి చేశారు.

కూతురి విషయంలో తల్లి ప్రాణం పోయింది

కూతురి విషయంలో తల్లి ప్రాణం పోయింది


కాలేజ్ అమ్మాయి తల్లి లీలావతి దేవికి తీవ్రగాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న కాలేజ్ అమ్మాయి తల్లి లీలావతి దేవి చికిత్స విఫలమై ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. లీలావతి దేవిని హత్య చేశారని యువతి తల్లి, ఆమె సోదరుడి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+