సెక్స్ స్కాండల్ దెబ్బకు చలో హాసన్, రాజకీయం అంటున్న మాజీ సీఎం, ఎలా అంటారని ?
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్ డ్రైవ్ కేసుకు సంబంధించి ఈనెల 30వ తేదీన చలో హాసన్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటాన్ని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ నిర్వహిస్తోంది. మహిళల గౌరవాన్ని కాపాడండి, హాసన్ గౌరవాన్ని కాపాడండి అనే నినాదంతో భారీ పోరాటం చేయనున్నామని ఆ కార్యక్రమం నిర్వహకులు ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
దీనికి సంబంధించి పోస్టర్లు కూడా విడుదల చేశారు. చలో హాసన్ కార్యక్రమం గురించి శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆ సంస్థ నాయకుడు దర్మేష్ మాట్లాడారు. మే 30వ తేదీన పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోరాట యోధులు, రచయితలు, అభ్యుదయవాదులతో సహా వేలాది మంది పాల్గొంటారని దర్మేష్ తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసి శిక్షించాలని దర్మేష్ డిమాండ్ చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు షేర్ చేసి అవి వైరల్ అయ్యేందుకు కుట్ర పన్నిన వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేయనున్నట్టు దర్మేష్ తెలిపారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా విస్తృతంగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో హాసన్ పరువు పోయిందని, హాసన్ పరువు కాపాడేందుకు తాము ఈ పోరాటం చేస్తున్నామని దర్మేష్ తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడి, ఆశా వర్కర్లు పాల్గొంటారని దర్మేష్ తెలిపారు. అయితే ఈ పోరాటాన్ని దారి మళ్లించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిపై దర్మేష్ మండిపడ్డారు. ఇది కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆశీస్సులతతో జరుగుతున్న పోరాటమని హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు.

మాజీ సీఎం కుమారస్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఆయన మహిళలకు అనుకూలంగా లేరా? ఇంత దుమారం రేగినప్పుడు ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారని, ఆయన ఇలా మాట్లాడుతారని మేము ఊహించలేదని దర్మేష్ ఆరోపించారు. చలో హాసన్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చెయ్యాలని దర్మేష్ ప్రజలకు మనవి చేశారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications