వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ వర్గం ఎమ్మెల్యేల రిసార్ట్ లీలలు: వీడియో విడుదల చేస్తా, రెబల్ ఎంపీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమ్మ జయలలిత ఫోటో పెట్టుకుని తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలోని 122 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కువత్తూరు రిసార్ట్ లో ఎలాంటి పనులు చేశారు ? వారి లీలలు ఏమిటీ ? అనే పూర్తి సమాచారం త్వరలో ప్రజల ముందు పెడుతానని ఆ పార్టీ రెబల్ ఎంపీ సుందరం సంచల వ్యాఖ్యలు చేశారు.

<strong>జైల్లో మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: మేమం ఉండలేం!</strong>జైల్లో మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: మేమం ఉండలేం!

నామక్కల్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్ తో సుందరం ఎంపీగా గెలుపోందారు. అన్నాడీఎంకే పార్టీలోని నాయకులు శశికళ, పన్నీర్ సెల్వం వైపు చీలిపోవడంతో రెండు వర్గాలుగా విడిపోయారు.

నామక్కల్ ఎంపీ సుందరం పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్నారు. గురువారం నామక్కల్ సమీపంలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సుందరం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Sundaram said that he will release the AIADMK MLA's Kuvathur Resort videos very soon.

<strong>తమిళనాడు జైలుకు శశికళ, వదిలే ప్రసక్తే లేదు: కర్ణాటక ప్రభుత్వం!</strong>తమిళనాడు జైలుకు శశికళ, వదిలే ప్రసక్తే లేదు: కర్ణాటక ప్రభుత్వం!

శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు కువత్తూరు రిసార్ట్ లో ఎలా డ్యాన్స్ చేశారు ? మందు పార్టీలతో ఎలా చిందులు వేశారు ? ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు ? శాసన సభ్యుల రిసార్ట్ లీలలు ఏలా ఉన్నాయి అనే పూర్తి సమాచారం మొత్తం తన దగ్గర వీడియో ఉందని చెప్పారు.

రిసార్ట్ లో శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎలా పాటుపడ్డారో అనే సమాచారం ఉన్న వీడియోలు మొత్తం త్వరలో విడుదల చేస్తానని బాంబు పేల్చారు. అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎంపీ సుందరం బహిరంగంగా మీడియా ముందు రిసార్ట్ వీడియో విడుదల చేస్తానని చెప్పడంతో శశికళ వర్గంలోని ఎమ్మెల్యే హడలిపోతున్నారు.

English summary
AIADMK MP Sundaram said that he will release the AIADMK MLA's Kuvathur Resort videos very soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X