బీహార్ కా సుల్తాన్ ఎవరంటే ? అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే మాట..!
బీహార్ అసెంబ్లీకి ఈ నెలలో రెండు విడతలుగా జరిగిన ఎన్నికలు ఇవాళ ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో విపక్ష మహాకూటమి హోరాహోరీగా తలపడింది. మధ్యలో ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగింది. వీరితో పాటు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పాటు ఇతర చిన్న పార్టీలు కూడా పోటీ పడ్టాయి. దీంతో ఈసారి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి ముగింపు పలుకుతూ ఇవాళ పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఫలితాలు ప్రకటించాయి.
ఇందులో దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయేకు విజయాన్ని కట్టబెట్టాయి. అదీ సాధారణ మెజార్టీతో పాటు భారీ మెజార్టీతో ఎన్డీయే గెలువబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి. అలాగే విపక్ష మహాకూటమి మరోసారి విపక్షానికే పరిమితం కావాల్సి వస్తుందని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. మరోవైపు తొలిసారి బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కూడా కనీస సీట్లతో సరిపెట్టుకుంటుందని వెల్లడించాయి.

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు దక్కుతాయని, మహాకూటమికి 70-90 సీట్లు లభిస్తాయని, జన్ సురాజ్ పార్టీకి 2-8 సీట్లు వస్తాయని తేలింది. పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయేకు 133-148 సీట్లు, మహాకూటమికి 87-102 సీట్లు, జన్ సురాజ్ పార్టీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని తేలింది. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయేకు 130-138 సీట్లు, మహాకూటమికి 100-108 సీట్లు, జన్ సురాజ్ కు 0, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని తేలింది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయేకు 133-159, మహాకూటమికి 75-101 సీట్లు, జన్ సురాజ్ కు 0-5 సీట్లు, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని తేలింది. జేవీసీ పోల్ లో ఎన్డీయేకు 135-150 సీట్లు, మహాకూటమికి 88-103 సీట్లు, జన్ సురాజ్ కు 0-1 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని తెలిపారు. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయేకు 145-160 సీట్లు, మహాకూటమికి 73-91 సీట్లు, జన్ సురాజ్ కు 0, ఇతరులకు 5-10 సీట్లు వస్తాయని తేలింది. పీమార్క్ పోల్ లో ఎన్డీయేకు 142-162 సీట్ల, మహాకూటమికి 80--98 సీట్లు, జన్ సురాజ్ కు 1-4 సీట్లు, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని తేల్చారు.












Click it and Unblock the Notifications