ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అరెస్ట్.. ఎక్కడ, ఎందుకంటే..
ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ రహమాన్ లఖ్వీని ఇవాళ (శనివారం) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థికసాయం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల సేకరణ కోసం లఖ్వీ ఒక డిస్పెన్సరీ నిర్వహిస్తున్నారని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) పోలీసులు వివరించారు.
పాకిస్తాన్ పంజాబ్‌లో లఖ్వీ నక్కి ఉన్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇన్ఫర్మేషన్‌తో అరెస్ట్ చేశారు. డిస్పెన్సరీ నుంచి లఖ్వీతోపాటు ఇతరులు కూడా నిధులను సేకరిస్తున్నారని విచారణలో తేలింది. ఇందులో కొంత మొత్తాన్ని లఖ్వీ తన సొంత అవసరాల కోసం కూడా వాడుకున్నారు.

ఎల్ఈటీకి చెందిన లఖ్వీ.. యూఎన్ నియమించిన వ్యక్తి అని పంజాబ్ పోలీసులు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ముందు జరగనుంది. 2015 ముంబై దాడి కేసులో లఖ్వీ బెయిల్‌పై ఉన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపుకు సంబంధించి కౌంటర్ సీటీడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications