వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటో డ్రైవర్ సమాధానానికి షాకైన యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆటో డ్రైవర్ చేసిన వ్యాఖ్యలతో ఓ మహిళ ఆశ్చర్యపోయింది. 30 ఏళ్ల అస్మిషా అనే మహిళ గత వారం తాను ఉండే అపార్టుమెంటు నుంచి కార్యాలయం వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆమె కొద్దిగా మూలకు జరిగి కూర్చుంది.

అది గమనించిన ఆటో డ్రైవర్.. కాస్త లోపలకు కూర్చోమని చెప్పాడు. ఆమె మాత్రం మా అమ్మను కూడా పికప్ చేసుకోవాలని చెప్పింది. అందుకే అలా కూర్చున్నానని చెప్పింది.

Mumbai auto driver body shames woman, complaint filed

దాంతో, సదరు ఆటో డ్రైవర్.. నేను పికప్ చేసుకోవాల్సిన మీ అమ్మగారు మీకన్నా లావుగా ఉంటుందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అశ్మిషాకు పట్టరాని కోపం వచ్చింది. డ్రైవర్‌ను నిలదీసింది. దానికి అతను లావుగా ఉన్న వాళ్లను తన ఆటోలో ఎక్కించుకోనని సమాధానం చెప్పాడు.

దీంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. వెంటనే ఆమె ఆటో నెంబర్ ప్లేటును ఫోటో తీసింది. అతనిని కూడా ఫోటో తీయాలని ప్రయత్నించింది. కానీ అతను తప్పించుకున్నాడు. అనంతరం అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

English summary
Body shaming in Indian society is a daily battle and often gains legitimacy through crude jokes and discourse in our popular culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X