తుపాకీతో బెదిరించి బట్టలు విప్పించారు: ముంబై వ్యాపారవేత్త సంచలన ఫిర్యాదు!

ముంబైకి చెందిన 51 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త సంచలనం సృష్టించే ఫిర్యాదు చేశారు. ఓ ఫార్మా కంపెనీకి చెందిన ఆరుగురు ఉన్నతాధికారులు తనను తుపాకీతో బెదిరించి బట్టలు విప్పమని బలవంతం చేసి బ్లాక్‌మెయిల్ కోసం తన ప్రైవేట్ దృశ్యాలను రికార్డ్ చేశారని ఆరోపించారు. జనవరి 18, 2023న కంపెనీ కార్యాలయానికి ఆమెను రప్పించినప్పుడు ఈ దారుణం జరిగినట్లుగా సమాచారం. పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఫార్మా కంపెనీ కార్యాలయంలోనే ఘటన
ముంబైలోని మహాలక్ష్మిలో డాక్టర్ ఇ మోసెస్ రోడ్డులో ఉన్న ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్యాలయంలో (రెండో అంతస్తులో) జనవరి 18, 2023న ఉదయం 11:30 AM నుంచి 1:00 PM మధ్య ఈ సంఘటన జరిగినట్లుగా ఎన్.ఎం. జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫోటోఫ్రేమ్, గిఫ్టింగ్ వ్యాపారం నడుపుతున్న ఆ మహిళకు నిందితులలో ఒకరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దానిని నమ్మి ఆమె ఫార్మా కార్యాలయానికి చేరుకుంది. కానీ అక్కడ ఏం జరగబోతుందో ఆమెకు తెలియదు.

Mumbai Businesswoman Alleges Assault and Blackmail by Pharma Executives FIR Filed

రివాల్వర్‌తో బెదిరింపులు.. నగ్నంగా చిత్రీకరణ
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఆమె కార్యాలయంలోకి ప్రవేశించిన వెంటనే, ఒక వ్యక్తి రివాల్వర్ బట్‌తో ఆమె భుజంపై, వీపుపై దాడి చేశాడని ఆరోపించింది. ప్రధాన నిందితుడు ఆమెను తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లి, ఆమె ధరించిన బురఖాను తొలగించాడు. ఆమె తలపై తుపాకీ పెట్టి బట్టలు విప్పమని బలవంతం చేశాడు. ఆమె లోదుస్తుల్లో ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. నిందితుడు ఆమెను బెదిరిస్తూ, తాను చెప్పినట్లు వినకపోతే, లేదా ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే ఈ దృశ్యాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించాడు.

తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఒత్తిడి
నిందితులు ఆమెను బెదిరించి తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే ఆమెపై తప్పుడు చట్టపరమైన కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని మహిళ ఆరోపించింది. గతంలో కూడా ఓ సీనియర్ అధికారి తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, దాని వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఆరుగురు ఫార్మా అధికారులపై ఐపీసీ సెక్షన్లు 354A, 354B, 326, 509, 506 తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66A కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు, పరిస్థితులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+