Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!

ముంబాయి/ చెన్నై/ బెంగళూరు: సినిమాల్లో నటించడానికి కొత్త నటీనటులు కావాలని నమ్మించి నటీనటులు, మోడల్స్ తో సీక్రెట్ గా అగ్రిమెంట్లు చేయించుకుని బలవంతంగా పోర్న్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఓటీటీ సీరిస్ లు తీసి లక్షల రూపాయలు సంపాధిస్తున్న ముఠా అడ్డంగా పోలీసులకు చిక్కిపోయింది. ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకిదిగి ఐదు మందిని అరెస్టు చేసి పోర్న్ వీడియోలో నటిస్తున్న మహిళను పట్టుకున్నారు.

మల్వానీ ఏరియా బంగ్లాలో!

మల్వానీ ఏరియా బంగ్లాలో!

ముంబాయిలోని మలద్ ప్రాంతంలోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరిస్తున్నారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెంటనే మల్వానీ ఏరియాలోని ఆ బంగ్లాలోకి ఎంట్రీ ఇవ్వడంతో వారి దిమ్మతిరిగిపోయింది.

పోర్న్ వీడియోలు తీసింది లేడీ ఫోటో గ్రాఫర్

పోర్న్ వీడియోలు తీసింది లేడీ ఫోటో గ్రాఫర్

బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరిస్తోందని ఓ మహిళా ఫోటోగ్రాఫర్ అని విషయం గుర్తించిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. పోర్న్ వీడియో చిత్రీకరిస్తున్న బంగాల్లో ఇద్దరు మగ పోర్న్ స్టార్లు, ఓ లైట్ మ్యాన్, గ్రాఫిక్ డిజైనర్ ఉండటంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో బలవంతంగా నటిస్తున్న మహిళను రక్షించామని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు.

స్కెచ్ అదిరిపోయింది

స్కెచ్ అదిరిపోయింది

సినిమాల్లో నటించడానికి ఔత్సాహిక నటీనటులు, మోడల్స్ కావాలని ఈ గ్యాంగ్ అనేక మందిని సంప్రధించింది. అనంతరం సినిమాల్లో నటించడానికి కొత్త నటీనటులు కావాలని నమ్మించి నటీనటులు, మోడల్స్ తో సీక్రెట్ గా అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి కేదారి పవార్ మీడియాకు చెప్పారు.

బలవంతంగా వీడియోలు

బలవంతంగా వీడియోలు

ఓటీటీ సిరీస్, సినిమాల్లో నటించడానికి అవకాశం ఇస్తామని నమ్మించి నటీనటుల దగ్గర అగ్రిమెంట్ లు చేయించుకున్న తరువాత వారిని బెదిరించి వారితో బలవంతంగా పోర్న్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి కేదారి పవార్ మీడియాకు వివరించారు. పోర్న్ వీడియోల ముఠా నుంచి రూ. 6 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ లు, కెమెరాలు, 6 స్మార్ట్ పోన్లు స్వాధీనం చేసుకున్నామని కేదారి పవార్ మీడియాతో అన్నారు.

పోర్న్ వీడియోలతో రూ. 36 లక్షలు

పోర్న్ వీడియోలతో రూ. 36 లక్షలు

అందమైన అమ్మాయిలు, ఆంటీలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించిన ఈ ముఠా రెండేళ్లలో రూ. 36 లక్షలు సంపాధించారని విచారణలో వెలుగు చూసిందని, వీరు అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి కేదారి పవార్ మీడియాకు చెప్పారు. ఔత్సాహిక నటీనటులు, మోడల్స్ ను వీరు టార్గెట్ చేసుకున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+