ఇదెక్కడి మాస్ రా మావ.. బిల్లు షేర్ చేయమన్నందుకు బ్రేకప్!

ముంబై లాంటి మెట్రో నగరాల్లో డేటింగ్ అంటే కేవలం కాఫీలు, డిన్నర్లు మాత్రమే కాదు.. అదో పెద్ద మైండ్ గేమ్. తాజాగా ముంబైకి చెందిన ఓ హై ప్రొఫైల్ యువతికి డేటింగ్‌లో ఎదురైన అనుభవం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం రూ.2,500 కోసం ఏకంగా పెళ్లి దాకా వెళ్లాల్సిన సంబంధాన్ని ఆమె తెంచుకోవడం ఇప్పుడు పెను చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందంటే..

ముంబైలో నివసించే 36 ఏళ్ల ఈ యువతి ఏడాదికి ఏకంగా రూ.80 లక్షల సంపాదిస్తోంది. కవల్ అనే మ్యాచ్ మేకింగ్ సర్వీస్ ద్వారా ఆమెకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. మొదటి రెండు సార్లు మీటింగ్స్ అంతా సాఫీగానే సాగింది, ఖర్చులన్నీ అతనే భరించాడు. కానీ అసలు ట్విస్ట్ మూడవ డేట్‌లో ఎదురైంది. ఆ రోజు డిన్నర్ బిల్లు రూ.5,000 రాగా.. ఆ యువకుడు సడన్‌గా "దీన్ని మనం సగం సగం (రూ.2,500 చొప్పున) బిల్ షేర్ చేసుకుందాం" అన్నాడు. ఆ మాట వినగానే ఆమె షాక్ అయింది.

Mumbai Dating Drama High-Earning Woman Ends Relationship Over Rs 2500 Dinner Bill Split Proposal

డబ్బు సమస్య కాదు.. 'లెక్కల' మనస్తత్వమే ప్రాబ్లం!

ఆమె నిశ్శబ్దంగా తన వాటా డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసింది. మరుసటి రోజే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆమె వెర్షన్ ప్రకారం.. "నాకు రూ.2,500 పెద్ద లెక్క కాదు, కావాలంటే దానికంటే పదింతలు నేనే ఖర్చు పెట్టగలను. కానీ, మూడో మీటింగ్ లోనే అతను లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. నా మీద ఇన్వెస్ట్ చేయడం విలువైనదేనా? అని అతను బేరాలు ఆడుతున్నట్లు అనిపించింది. బంధాన్ని కేవలం ఒక లావాదేవీలా (Transaction) చూసే వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేను" అని తేల్చి చెప్పేసింది.

డేటింగ్ సబ్సిడీ: ప్రేమలో పడితే రూ.12 వేలు, ప్రభుత్వం వినూత్న నిర్ణయం
డేటింగ్ సబ్సిడీ: ప్రేమలో పడితే రూ.12 వేలు, ప్రభుత్వం వినూత్న నిర్ణయం

నెటిజన్ల మధ్య యుద్ధం: తప్పెవరిది?

ఈ స్టోరీ బయటకు రాగానే సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. మహిళల మద్దతుదారులు.. ఆమె నిర్ణయం కరెక్ట్. మొదట్లోనే అంత పిసినారితనం చూపిస్తే రేపు పెళ్లి అయ్యాక ఇంకెన్ని లెక్కలు వేస్తాడో అని కొందరు కామెంట్ చేశారు.

యువకుడి మద్దతుదారులు.. "ఆ యువకుడు చాలా అదృష్టవంతుడు. రూ.2,500 కూడా షేర్ చేసుకోలేని అమ్మాయి భవిష్యత్తులో కష్టాల్లో తోడుంటుందని ఎలా నమ్ముతాం? రూ.80 లక్షలు సంపాదించే ఆవిడకు రూ.2,500 ఇవ్వడానికి అంత ఇగో ఎందుకు?" అని ప్రశ్నిస్తున్నారు.

గ్రీన్ సెక్స్ కు ఓటేస్తున్న జెన్ జీ - ఎందుకు ట్రెండ్ అవుతుంది?
గ్రీన్ సెక్స్ కు ఓటేస్తున్న జెన్ జీ - ఎందుకు ట్రెండ్ అవుతుంది?

2026లో డేటింగ్.. ఒక మానసిక యుద్ధం!

ఈ కాలంలో డేటింగ్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమే కాదు, అదో మానసిక యుద్ధంలా మారుతోందని నిపుణులు అంటున్నారు. కేవలం బిల్లు చెల్లించడం అనేది ఇక్కడ పాయింట్ కాదు, అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యమని కవల్ అభిప్రాయపడ్డాడు. ఈ చిన్న ఘటన ఆధునిక ప్రేమ బంధాల్లో ఆర్థిక అంశాలు, వ్యక్తిగత ఇగోలు ఎంతలా పెనవేసుకుపోయాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+