వైరల్ వీడియో: కుక్కను చంపి.. కళ్లు పీకి.. గోలీలు ఆడాడు
కళ్లు పీకి గోలీలు ఆడుకుంటాం.. అని సామెతగా వాడుతారు. ఓ వ్యక్తి దాన్ని నిజం చేశాడు. ఓ వ్యక్తి వీధి కుక్కపై క్రూరత్వానికి పాల్పడ్డాడు. వీధి కుక్కను దారుణంగా చంపేశాడు. దాని కనుగుడ్లు పీకి గోలీలు ఆడుకున్నాడు. ఇదంతా పబ్లిక్ లో రోడ్డుపైనే అందరూ చూస్తుండగానే చేశాడు. ఇది చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ వ్యక్తి వైపునకు వెళ్లేందుకు భయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడ్ని అరెస్ట్ చేసి యానిమల్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ముంబై సబ్ అర్బన్ లోని ముంబ్రాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అటుగా వెళ్తున్న వీధి కుక్కను దారుణంగా చంపేసి దాన్ని కళ్లు పీకాడు. వాటితో ఆటలాడుతూ కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న జరిగింది. వీధిలో వెళ్తున్న కుక్కపై దాడి చేసి చంపి.. అందరూ చూస్తుండగానే ఆ కుక్క కళ్లను పీకేశాడు. వాటిని చేతిలో పట్టుకుని ఆడుకున్నాడు. ఈ దృశ్యాలు చూసి భయబ్రాంతులకు లోనైన చుట్టుపక్కన ప్రజలు వెంటనే ముంబ్రా పోలీసులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ వెంటనే ముంబ్రా పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 325 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications