ఇల్లు లాంటి ఆటో.. హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిదా.. సోషల్ మీడియాలో హల్‌చల్
Recommended Video
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. తాము చేసే పనుల్లో కొందరు వైవిద్యత చాటుతుంటారు. అందరిలా కాక డిఫరెంట్‌గా ఆలోచించి వార్తల్లో నిలుస్తారు. ముంబైకి చెందిన సత్యావాన్ గితే కూడా అలాంటి కోవకు చెందుతారు. ఆటో నడిపే సత్యవాన్ ఏం చేశాడో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీ చదవండి.

వినూత్న ఆలోచన
ముంబైకి చెందిన సత్యవాన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అందరిలా కాకుండా వైవిద్యం ఏదైనా చేయాలని అనుకున్నాడు. తన ఆటో రూపురేఖలను మార్చివేశాడు. ఇదీ ఆటోనా లేదా ఇల్లు అనే అనుమానం కలుగుతుంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి ఇంట్లో ఉన్న ఫీల్ కలిగించేలా ఏర్పాట్లు చేశారు.

మంచి నీరు..
ఆటోలో ప్రయాణిస్తుంటే ప్యాసెంజర్స్‌కు దాహం వేస్తోంది. అందుకోసం నీళ్లను ఏర్పాటుచేశారు. కొందరు టిఫిన్ చేశాక.. చేతులు కడుక్కునేందుకు వాష్ బేషిన్ కూడా ఆమర్చారు. దీంతో పిల్లలు ఉంటే వాహనం పక్కకు ఆపాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రయాణిస్తూనే తమ అల్పహారం పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు.

డెస్క్‌టాప్..
దీంతోపాటు పక్కన కంప్యూటర్ డెస్క్‌టాప్ మానిటర్ కూడా ఉంది. అవసరం ఉన్నవారు ఏమైనా బ్రౌజ్ చేసుకొనే వీలుంటుంది. ప్రయాణిస్తున్న సమయంలో కొందరు మొబైల్స్ చార్జింగ్ అయిపోతుంటుంది. అలాంటి సమయంలో అత్యవసరంగా ఫోన్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చార్జింగ్ సాకెట్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో ప్యాసెంజర్స్ తమ మొబైల్స్ చార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

కాసిన్ని మొక్కలు
పర్యావరణానికి హాని కలిగించే చార్జింగ్, డెస్క్ టాప్ ఏర్పాటుచేసిన సత్యవాన్.. దానిని నివారించేందుకు ఇతోధికంగా మొక్కలు కూడా పెంచుతున్నారు. ఒకవైపు దిగే చోట భారీ మొక్కలు ఉంచి ప్రయాణికులు తాము ఇంట్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు. ముంబై రహదారుల్లో తిరుగుతున్న సత్యవాన్ ఆటో అలా అందరికీ తెలిసిపోయింది. ఒక్కొక్కరూ సత్యవాన్ చూపిన చొరవను ప్రసంశిస్తున్నారు.
ట్వింకిల్ ఫిదా
సత్యవాన్ ఆటోను చూసిన ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ఆశ్చర్యపోయారు. ఆటోలో ఇన్ని సౌకర్యాలా అంటూ సంబరపడిపడిపోయారు. ఇది ఆటోనా లేదా ఇల్లా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆటోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.

స్పెషల్..
సత్యవాన్ ఆటో ప్రత్యేకం అని ప్రయాణికులు కొనియాడుతున్నారు. ఆటోలు ఇన్ని సౌకర్యాలు కల్పించడం విశేషం. ప్రయాణిస్తున్న సమయంలో తాను మంచి ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఇంకొందరు ఆటో సేవలను వినియోగించుకుంటామని కామెంట్ చేశారు. చాలా మంది సత్యవాన్ చొరవను అభినందిస్తున్నారు.

సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ..
ఆటోలో చార్జింగ్ పెట్టుకోవాలని, పరిశుభ్రమైన నీరు అందిస్తానని సత్యవాన్ చెప్తున్నారు. వృద్ధులను ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా తీసుకెళ్తానని ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ఆటోలో వసతులు ఏర్పాటుచేసినట్టు వివరించారు.

ఆశ్చర్యం..
తన ఆటో గురించి ట్వింకిల్ ఖన్నా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయడంపై సత్యవాన్ స్పందించారు. ట్వింకిల్ తన ఆటోను షేర్ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ట్వింకిల్‌తోపాటు అక్షయ్ తనను మెచ్చుకోవడం సత్యవాన్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. త్వరలోనే అక్షయ్ దంపతులను కలుస్తానని సత్యవాన్ పేర్కొన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications