ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైన ముంబైలో తాజాగా ఒక్కరోజులో చాలా తక్కువగా నమోదవడం గమనార్హం. తాజాగా, 8776 మందికి పరీక్షలు నిర్వహించగా 700 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీఎంసీ కమిషనర్ వెల్లడించారు.

ఆదివారం వెయ్యికిపైగా నమోదైన కేసులతో పోలిస్తే ఈ ఫలితాలు ఊరటనిస్తున్నాయని కమిషనర్ తెలిపారు. గత మూడు నెలల్లో ఈ రోజు వచ్చిన కేసులే అత్యల్పమని తెలిపారు. దీంతో ముంబైలో ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

Mumbai Sees Lowest Single-Day Corona Cases In 3 Months

మరోవైపు అక్కడ రికవరీ రేటు కూడా పెరిగిందని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల పరంగా చూస్తే థాణే, పుణె నగరాల కన్నా ముంబై మెరుగ్గా ఉందన్నారు. ఇక దేశంలో వైరస్ మొదలైన నాటి నుంచే మహారాష్ట్ర అత్యధిక కేసులతో తల్లడిల్లింది.

లాక్‌డౌన్ సమయంలోనూ కేసులు పెరుగాయి. ఈ క్రమంలోనే బీఎంసీ మొదట ధారావి లాంటి మురికివాడపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పుడక్కడ వైరస్ వ్యాప్తిని దాదాపు పూర్తిగా అడ్డుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,83,723 కరోనా పాజిటివ్ కేసులుండగా, 1,47,592 యాక్టివ్ కేసులున్నాయి.

2,21,944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 13,883 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇక ముంబైలో 1,10,182 కరోనా పాజిటివ్ కేసులుండగా, 21,812 యాక్టివ్ కేసులున్నాయి. 81,944 మంది కోలుకున్నారు. 6,132 మంది మృతి చెందారు.

Recommended Video

    Sushant Singh Rajput: Mahesh Bhatt records his statement with Mumbai Police

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+