కొడుక్కి నరేంద్ర మోడీ పేరు.. ముస్లిం మహిళ సంచలన నిర్ణయం
లక్నో : 2014 లోక్‌సభ ఎన్నికల వేళ నమో మంత్రం బాగానే పనిచేసింది. అదే కోవలో ఈసారి కూడా నమో మంత్ర వర్కవుట్ అయింది. 50 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి అంత పెద్ద మొత్తంలో మెజార్టీ రావడం ఇదే తొలిసారి. అయితే ఈ విజయాన్ని అభిమానులు, మద్దతుదారులు ఆస్వాదిస్తున్నారు. పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో యూపీలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతానికి చెందిన మీనాజ్ బేగం ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజే ఆ బాబుకు పేరు పెట్టాల్సిన రోజు. దాంతో మీనాజ్ బేగం వివిధ పేర్లను పరిశీలించింది. దుబాయ్‌లో ఉంటున్న భర్తతో కూడా ఫోన్‌లో మాట్లాడి ఏం పేరు పెడదామని అడిగి తెలుసుకుంది. చివరకు ఆమె నిర్ణయం ప్రకారం నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే పేరు పెట్టారు.

అయితే మోడీ పేరు పెట్టడం కుటుంబ సభ్యులకు నచ్చలేదు. మీనాజ్‌కు ఎంత నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. మే 23వ తేదీన ఫలితాలు రావడం.. మోడీ సర్కార్ ప్రభంజనం మరోసారి మార్మోగడం దృష్ట్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబ సభ్యులు, ఇతర పెద్దలు ఆ పేరు వద్దని ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు. తాను అనుకున్నట్లే, తన ఇష్ట ప్రకారమే ఆ పిల్లోడికి మోడీ పేరు ఖరారు చేశారు. ఆ మేరకు పంచాయతీ కార్యదర్శిని కలిసి అదే పేరును రిజిస్టర్ చేయించారట.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications