శివుడి గుడిలో నమాజ్ చేసిన ముస్లీం మహిళలు, వీడియో వైరల్, అసలు మ్యాటర్ తో షాక్ !
లక్నో/బరేలి: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ముస్లిం యువతి తన సవతి తల్లితో కలిసి ఆలయాన్ని సందర్శించి అక్కడే సీక్రేట్ గా నమాజ్ చేసిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. బరేలీలోని భూటా పోలీస్ స్టేషన్‌లో నేరపూరిత కుట్ర, మత మనోభావాలను దెబ్బతీయడం ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు.
యువత, ఆమె సవతి తల్లితో పాటు స్థానికులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో సోదరుడితో కలిసి ఉంటున్న యువతి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల బరేలీలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చింది. ఔషధాలతో ఆమె వ్యాధిని నయం చేయలేకపోయింది. తరువాత సవతి తల్లి స్థానిక దేవాలయాన్ని సందర్శించమని యువతికి సలహా ఇచ్చింది.

శనివారం సాయంత్రం సవతి తల్లితో కలిసి ఆ యువతి అక్కడికి వెళ్లగా గుడిలోపల ఆమె నమాజ్ చేస్తోందని గుర్తించి కొందరు వీడియో చిత్రీకరించారు. గుడిలో యువతి నమాజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ రైట్‌వింగ్ గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతితో సహ ఆమె సవతి తల్లి, స్థానికులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
వివిధ సమూహాల మధ్య శత్రుత్వం పెంచేలా గుడిలో నమాజ్ చేశారని కొందరు ఆరోపించారు. ఇప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో వివాదం ముదిరిపోయింది. మహిళలు ఆలయంలో నిలబడి ఇస్లామిక్ భంగిమలో ప్రార్థనలు చేయడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు అని స్థానికులు అంటున్నారు. అలాగే రెండవ వీడియో క్లిప్‌లో మహిళ తన చుట్టూ ఉన్న కొంతమందితో కలిసి శివుడి విగ్రహం ముందు నమస్కరిస్తున్నట్లు చూడవచ్చు.
ఈ సంఘటనకు సంబంధించి బరేలి రూరల్ ఏఎస్సీ ముఖేష్ చంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ శనివారం భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసర్‌పూర్ గ్రామంలోని పురాతన శివాలయంలో ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తూ కనిపించారు. ఈ మేరకు ఫిర్యాదు నమోదు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వివరించారు.

ఫిర్యాదుదారు రెండవ వీడియోను మాకు అందించలేదు. మరిన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేసి విచారణలో వాటిని పరిశీలిస్తామని ముఖేష్ చంద్ర మిశ్రా తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన మహిళ సోదరుడు నా సోదరికి ఆరోగ్యం బాగాలేదని, మా సవతి తల్లి ఆమెను చికిత్స కోసం బరేలీకి తీసుకువెళ్లిందని చెప్పాడు..
ఆమెకు వ్యాధి నయం చేయడానికి ఇది ఒక్కటే మార్గమని ఆలయంలో పూజలు చేశామని, నా సోదరి నేరస్థురాలు కాదని, ఆమెను జైలుకు పంపకూడదని, ఆమె ఆనారోగ్యంతో బాదపడుతోందని పోలీసులకు మనవి చేశారు. అయితే ఈ విషయంలో లోతుగా విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications