నా మొగుడు సింహం లాంటివాడు, సింగిల్ గానే వస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి భార్య వార్నింగ్, ఎవరికంటే !
గాలి జనార్దన్ రెడ్డి సింహాం లాంటి వాడని, సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ ప్రత్యర్థులకు బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సొంత మరిది గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి శ్రీరాములుపై గాలి జనార్ధన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఎప్పటికి సింహం అని, సింహం ఎప్పుడూ ఒంటరిగానే వస్తుంది తప్పా వెనుక వేరేవాళ్లను పిలుచుకుని రాదని గాలి లక్ష్మీ అరుణ ప్రత్యర్థులకు గుర్తు చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి శత్రువులుగా తయారైన వారికి ఆయన సతీమణి లక్ష్మీ అరుణ ఇలా గట్టి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డిల పేర్లు ఎత్తకుండానే వారికి గాలి లక్ష్మీ అరుణ బళ్లారిలో వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

గాలి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన ఆయన భార్య లక్ష్మీ అరుణ కొందరి పేర్లు చెప్పకుండానే సొంత మరిదికి, ఇంతకాలం గాలి జనార్దన్ రెడ్డి వెనుక తిరిగి ఇప్పుడు బీజేపీలోనే ఉన్న మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములను మా కుటంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. నా భర్త గాలి జనార్దన్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో ఎందరో వ్యక్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని, సీఎం కూడా అయ్యారని గాలి లక్ష్మీ అరుణ అన్నారు.
నా భర్తకు రక్తం పంచుకున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారని, వారికంటే రక్తం పంచుకోకుండా దగ్గర అయిన వాళ్లకు నా భర్త గాలి జనార్దన్ రెడ్డిని ఎక్కువ ప్రేమ పంచిపెట్టారని, వారికి ఎంతో సహాయం చేశారని లక్ష్మీ అరుణ పరోక్షంగా మాజీ మంత్రి శ్రీరాములను ఉద్దేశించి అన్నారు. తన భర్త గాలి జనార్దన్ రెడ్డి ఆశీర్వాదంతో గతంలో కొందరు ఎమ్మెల్యేలుగా, కేఎంఎఫ్ చైర్మన్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా పదవులు దక్కించుకున్నారని, అలాంటి వాళ్లు నేడు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞత చూపించడంలేదని, వాళ్లు అందరూ నా భర్త సహకారంతోనే ఎదిగారని లక్ష్మీ అరుణ ఆరోపించారు.
ఇంకా కొందరు కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారని, మేము నాయకులు కాబట్టే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలుగా మారామని గొప్పలు చెప్పుకుంటున్నారని గాలి లక్ష్మీ అరుణ వ్యంగ్యంగా అన్నారు. శత్రువులకు శత్రువు తనకు మిత్రుడని, గాలి జనార్దన్ రెడ్డికి శత్రువులు అయిన వాళ్లతో ఇప్పుడు ఆయన ఆధరించిన వాళ్లు చేతులు కలిపారని లక్ష్మీ అరుణ ఆరోపించారు,

ఎంత మంది శత్రువులు కలిసినా నా భర్త గాలి జనార్దన్ రెడ్డిని ఏమీ చెయ్యలేరని, ఆ విషయం వాళ్లు తెలుసుకుంటే వాళ్లకే మంచిదని లక్ష్మీ అరుణ అన్నారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి వెంట తిరిగి లబ్దిపొందిన వాళ్లు ఇప్పుడు అదే గాలి జనార్దన్ రెడ్డి శత్రువులతో చేతులు కలిపారని గాలి లక్ష్మీ అరుణ విచారం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు అందరూ కలిసి తనను బళ్లారి ఎన్నికల్లో ఓడించారని గాలి లక్ష్మీ అరుణ ఆరోపించారు.
ఇలాంటి వాళ్లందరికీ నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను, శత్రువులు అందరూ ఏకం అయినా సింహం లాంటి నా భర్త గాలి జనార్దన్ రెడ్డిని ఏమీ చెయ్యలేరని, మళ్లీ సింహం ఇక్కడికి వస్తుందని, మీరంతా జాగ్రత్తగా ఉండాలని లక్ష్మి అరుణ గాలి జనార్దన్ రెడ్డి శత్రువులను హెచ్చరించారు. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి భార్య ఇలా బహిరంగంగా కుటుంబ సభ్యులతో పాటు గాలి జనార్దన్ రెడ్డి శత్రువులకు వార్నింగ్ ఇవ్వడం బళ్లారిలోనే కాకుండా కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications