Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్నమ్మలో ఇలాంటి నైజం కూడా: 'జయ' ప్రేమగా మాట్లాడినా తన్ని తరిమేసేది..

అమ్మ ప్రేమగా ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడిందని తెలిస్తే.. వారిని ఎస్టేట్ నుంచి తన్ని తరిమేసేవారని దివాకరన్ తెలిపాడు.

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల అనేక అనుమానాలు ముప్పిరిగొన్న దశలో ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి 'అమ్మ'కు జరిగిన పూర్తి చికిత్స వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

జయలలిత మృతికి ఎవరూ కారణం కాదని, ఆసుపత్రికి వెళ్లేముందు ఆమెపై దాడి జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పుడు మెడిసిన్ ఇవ్వలేదని, ఇన్ ఫెక్షన్, శ్వాసకోశ మరియు డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలతోనే జయలలిత మృతి చెందారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఇలాంటి తరుణంలో జయలలిత డ్రైవర్ ఒకరు అమ్మ మృతిపై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వయసులో జయలలిత మరణించే అవకాశమే లేదని, ఆమె మృతిపై అనుమానాలున్నాయని అతను తెలిపాడు. అలాగే చిన్నమ్మ శశికళకు సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'శశికళ' దేవుడి నుంచి తప్పించుకోలేదు:

'శశికళ' దేవుడి నుంచి తప్పించుకోలేదు:

కొడనాడులో జయలలితకు ఉన్న ఎస్టేట్ లో డ్రైవర్ గా పనిచేసే దివాకర్(42) అమ్మ మృతి పట్ల తాజాగా అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వయసులో జయలలిత మృతి చెందే అవకాశమే లేదనేది దివాకర్ అభిప్రాయం.

జయలలితకు అసలేం జరిగిందన్నది శశికళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసుంటుందని, వారు చట్టం నుంచి తప్పించుకున్నా.. దేవుడి దృష్టి నుంచి తప్పించుకోలేరని తీవ్రంగా హెచ్చరించాడు.

చిన్నమ్మలో మరో కోణం:

చిన్నమ్మలో మరో కోణం:

కొడనాడు ఎస్టేట్ కు వచ్చిన సమయంలో జయలలిత అందరితోను ప్రేమగా మాట్లాడేవారని దివాకరన్ చెబుతున్నారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ మాత్రం జయలలిత అందరితో ప్రేమగా మాట్లడటాన్ని సహించలేకపోయేవారని అతను చెప్పాడు.
జయలలిత ఎవరితో ప్రేమగా మాట్లాడిన శశికళకు నచ్చకపోయేదని దివాకరన్ తెలిపాడు.

శశికళను చూస్తే జడుసుకోవడమే:

శశికళను చూస్తే జడుసుకోవడమే:

జయలలితతో అందరు ఎంత ప్రేమగా మాట్లాడుతారో.. చిన్నమ్మ శశికళకు అంతగా జడుసుకుంటారని దివాకరన్ తెలిపాడు. 2005-2009 మధ్య కాలంలో అమ్మకు ముందు భద్రత కోసం వెళ్లే కారులో తాను డ్రైవర్‌గా పనిచేసే వాడినని తెలిపాడు.

తరిమేసింది.. కొంతమందిని కొట్టి పంపించేశారు:

తరిమేసింది.. కొంతమందిని కొట్టి పంపించేశారు:

అమ్మ ప్రేమగా ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడిందని తెలిస్తే.. వారిని ఎస్టేట్ నుంచి తన్ని తరిమేసేవారని దివాకరన్ తెలిపాడు. తనకు తెలిసినంతవరకు నలుగురు వ్యక్తులను చిన్నమ్మ కొట్టి మరీ అక్కడి నుంచి పంపించేసిందని పేర్కొనడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+