OScar 2023: విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్ర - నాటు నాటుకు ఆస్కార్ అవార్డు..!!

ఆర్ఆర్ఆర్ చరిత్ర తిరగరాసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

ఆర్ఆర్ఆర్ చరిత్ర తిరగరాసింది. తెలుగోడి హృదయం ఉప్పొంగేలా చేసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచ పటంపై జక్కన్న మెరిసారు. జూనియర్ ఎన్టీఆర్ -రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ఆస్కార్ వేదిక పైన నాటు నాటు స్టెప్పులతో దుమ్ము లేచింది. వేదిక పైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్‌ దద్దరిల్లిపోయింది. కీరవాణి..చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. నమస్తే అంటూ ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ప్రత్యేకంగా నిలిచారు.

ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు క్రేజ్

జూ ఎన్టీఆర్..రాం చరణ్ చరిత్ర పటంలో నిలిచారు. జక్కన్న దర్శక ప్రతిభకు ప్రపంచం మురిసిసోయింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ గెలుపు బావుగా ఎగరవేసింది, బెస్ట్ ఒర్జినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను ముద్దాడింది. అస్కార్ అందుకున్న తొలి భారతీయ పాటగా కొత్తి రికార్డును క్రియేట్ చేసింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్‏తో అదరగొట్టారు. హాలీవుడ్ డ్యాన్సర్స్ వెస్టర్స్ డాన్స్ తో మెప్పించారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో.. లాల్చీ, పంచకట్టులో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అవార్డు ప్రకటించగానే ఆర్ఆర్ఆర్ టీం సంతోషానికి ఆకాశమే హద్దుగా కనిపించింది. రాజమైళి, మూవీ యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్..రాం చరణ్ అభిమానులు పండగు చేసుకుంటున్నారు.

మధుర క్షణాల్లో ..భావోద్వేగం

ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వేదిక పైన అవార్డు అందుకున్న కీరవాణి ఆ మధుర క్షణాలను వేదిక పై నుంచే పంచుకున్నారు. ఈ అవార్డు తో ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రపంచంలో ఎంతో ఎత్తున నిలబెట్టిందని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్​, క్రిటిక్స్ ఛాయిస్​ ఆవార్డులు సాధించింది. కరోలినా, సియావో పపా, హోల్డ్‌ మై హ్యాండ్‌ పాటలతో నాటు నాటు పోటీపడింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌-HCA అవార్డును సైతం నాటు నాటు కొల్లగొట్టింది.

తారక్ - చెర్రీ అభిమానుల పండుగ

నాటు నాటు పాటకు ఆస్కార్ రావటంతో తారక్ - చెర్రీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోల పాటకు ఆస్కార్ రావటంతో ఉప్పొంగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. ఆర్ఆర్ఆర్ టీంను అభినందించారు. నాటు నాటు లైవ్ ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టారు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌. ఇండియన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ లాల్చీ పంచకట్టులో ప్రపంచ వేదికపై నాటు నాటు పాటను ఆలపించారు. ఆస్కార్ వేదికపై హుషారెత్తించే పల్లెపాటతో ఉర్రూతలూగించారు. ఇక నాటునాటుకు వెస్ట్రన్‌ డ్యాన్సర్స్‌తో కలిసి..అమెరికా నటి గాట్లీబ్ స్టెప్పులేశారు. నాటు నాటు సాంగ్ లైవ్‌ పెర్ఫామెన్స్‌కు ఆస్కార్స్‌లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+