విద్యార్థులపై విరిగిన లాఠీ- రణరంగం: సీఎంఓ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Nabanna Abhiyan: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.

ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Nabanna Abhiyan Police use water cannons and tear gas shells to disperse protestors

ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు.

తాజాగా- మరోసారి విద్యార్థులు రోడ్డెక్కారు. హౌరాలో భారీ ప్రదర్శన చేపట్టారు. నబన్న అభియాన్ పేరుతో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనకు వందలాదిగా తరలివచ్చారు. హౌరాలో గల ముఖ్యమంత్రి కార్యాలయం భవన సముదాయం నబన్నను ముట్టడించడానికి ప్రయత్నించారు.

Nabanna Abhiyan Police use water cannons and tear gas shells to disperse protestors

నబన్న అభియాన్ నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రోడ్లపై అడ్డంగా ఐరన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ షెల్స్ సిద్ధం చేసుకున్నారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించారు గానీ అవి సఫలం కాలేదు.

వందలాది మంది విద్యార్థులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడం, వారిని అడ్డుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున లాఠీఛార్జీకి దిగడం చకచకా సాగిపోయాయి. బ్యారికేడ్లను దాటుకుని ముఖ్యమంత్రి కార్యాలయం వైపునకు దూసుకుని రావడానికి ప్రయత్నించిన వారిని వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

దీనితో ఈ ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారింది. పోలీసు వాహనాల సైరన్ మోతలు, ఆందోళనకారుల నిరసనల మధ్య ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+