భారత్ లో ఫారిన్ రేంజ్ లొకేషన్స్.. తక్కువ ఖర్చుతో.. ఎలా వెళ్లాలి..?
చాలామందికి విదేశాల్లో ప్రయాణించాలని ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల ప్రయాణాలను విరమించుకుంటారు. కొందరు బడ్జెట్ సరిపోకపోవడం కారణంగా.. మరికొందరు సమయం లేక అంత దూరం వెళ్లడానికి ఇష్టపడరు. అయితే మనదేశంలోనే విదేశాల్లో ఉండే లొకేషన్స్ తో ఫారిన్ ట్రిప్ ఫీలింగ్ వచ్చేలా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడికి వెళ్తే మంచి అనుభూతి పొందుతారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది..? ఎలా వెళ్లాలి..?
శీతాకాలంలో కొన్ని ప్రదేశాలు పర్యటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. చుట్టూ పర్వతాల నడుమ.. ఓ వైపు మంచు జల్లులు.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. అదే ఉత్తరాఖండ్ లోని నైనిటాల్. ఇది ఉత్తరాఖండ్ లోనే ప్రముఖమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. శీతాకాలంలో అంటే ఎక్కువగా అక్టోబర్ నుంచి డిసెంబర్, జనవరి మధ్యలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే పర్యటకులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చల్లని గాలులు, అబ్బురపరిచే సరస్సులు, జలపాతాలు, మాపిల్, చెర్రీ చెట్లు విశేషంగా ఆకట్టుకుంటాయి.
అంతేకాక నైనిటాల్ లో ట్రెక్కింగ్ చేయడం ఓ మరచిపోలేని అనుభూతి. పైన్ అడవుల గుండా ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడి స్నో వ్యూ పాయింట్, నైనా శిఖరం, టిఫిన్ టాప్.. ప్రదేశాలు చూడచక్కగా ఉంటాయి. అందమైన దృశ్యాల మధ్య తెల్లవారుజామున ట్రెక్కింగ్ మనలో కొత్త శక్తిని , నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అలాగే నైనిటాల్ లో గుర్రపు స్వారీ కూడా ఉంటుంది. నగరంలోని బారా పత్తర్ నుండి టిఫిన్ టాప్ వరకు పర్యటకులు గుర్రపు స్వారీని ఆస్వాదించవచ్చు. ఒంపులు తిరుగుతూ పర్వతాల మధ్య ఉన్న మార్గాల వెంట గుర్రపు స్వారీ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. గుర్రపు స్వారీ గొప్ప అనుభూతిని ఇస్తుంది.
నైనిటాల్ నగరం పరిసర ప్రాంతాల్లోని సత్తాల్, భీమ్ టాల్, బ్రహ్మా స్థల్, పాంగోట్ , రామ్‌గఢ్.. తదితర ప్రాంతాలలో క్యాంపింగ్ చేయవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణంలో సంగీతం, బార్బెక్యూలు, చలి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే నైనిటాల్ లో రోప్ వే కూడా ఉంది. ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక నైనిటాల్ నగరాన్ని విమానం, రైలు లేదా రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నైనిటాల్ కు సమీప విమానాశ్రయం పంత్ నగర్ విమానాశ్రయం (PNQ).. హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి ఇక్కడికి చేరుకుని.. ఇక్కడి నుండి క్యాబ్ లేదా బస్సులో నైనిటాల్ వెళ్లొచ్చు. ఇక నైనిటాల్ కు సమీప రైల్వే స్టేషన్ కత్గోడం (KGM).. ఇది నైనిటాల్ నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉంది. అలాగే దిల్లీ నుంచి బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications