నగ్నంగా యువతీ యువకుడు.. ప్రేమకు అంగీకరించకపోవడంతో, శవాలుగా
ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఇద్దరి వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. ప్రియురాలికి ఇష్టం లేకపోయినా మరో యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. ప్రియుడిని ఢిల్లీకి పంపించేశారు. తమ ప్రేమను బతికించుకోలేకపోయిన ప్రేమజంట అనూహ్యంగా శవాలై కనిపించారు. ఇద్దరి ఒంటిపై బట్టల్లేకుండా నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటన యూపీలో జరిగింది.

బట్టలు లేకుండా..
బరేలీ జిల్లాకు చెందిన యువతీ యువకుడు నగ్నంగా పడి ఉన్నారు. సమీపంలో ఎలుకల మందు ప్యాకెట్ ఉండటం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు విషం తీసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రేమ జంట ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.

ప్రేమ పెళ్లికి నో
ప్రేమ పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామని బరేలీ ఎస్‌ఎస్పీ రోహిత్ సింగ్ తెలిపారు. ఇరుకుటుంబ సభ్యులు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా ? మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. యువతీ యువకుల ఫోన్ కాల్ డేటా పరిశీలించామని.. ఆమెకు పెళ్లైన తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లోనే ఉన్నట్లు తెలిసిందన్నారు.

ఊరిలోని వారందరికీ తెలుసు
మృతి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారని గ్రామస్థులందరికీ తెలుసని ప్రియుడి బంధువు ఒకరు తెలిపారు. వారిద్దరి పెళ్లికి పంచాయతీ పెద్దలు నిరాకరించారని.. ఆమెకు మరొకరితో వివాహం జరిపించారని చెప్పారు. ప్రియుడిని ఢిల్లీకి పంపించేసినా ఆమె ఎలా ఉందంటూ తనకు ఫోన్ చేసి వాకబు చేసేవాడని తెలిపారు. వారిద్దరూ ఒకరినొకరు ఉండలేకపోయారని చెప్పారు.












Click it and Unblock the Notifications