Bengaluru: మెట్రోలో గోబీ మంచూరి తిని వీడియో తీసిన యూట్యూబర్, వెంటాడి పట్టుకుని !
బెంగళూరు: తిక్కతిక్క చేష్టలు చేసేవాళ్లు ఎక్కువ అవుతున్నారని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పెట్టిన కొన్ని నియమాలు కావాలనే ఉల్లంఘించిన వారికి అపరాదరుసుం విధించినా ఇలాంటి చేష్టలు చేసేవాళ్లు ఎక్కువ అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నమ్మ బెంగళూరు (Bengaluru) మెట్రో రైలులో (metro train) గోబీ మంచూరి తిన్న ఓ యూట్యూబర్ ను (YouTuber)వెతికి పట్టుకున్న అధికారులు అతనికి అపరాదరుసుం విధించి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు మెట్రో రైలు (metro train) ప్రయాణికులకు సంబంధిత అధికారులు కొన్ని షరతులు విధించారు. సిగరెట్లు, అగ్గిపెట్టలు, మంటలు వ్యాపించే వస్తులు మెట్రో రైలులో తీసుకెళ్లడం నిషేధం. కొన్ని ఆహారపదార్థాలు తీసుకెళ్లడానికి అధికారులు అనుమతి ఇచ్చినా సదరు ప్రయాణికులు ఆహారపదార్థాలు మెట్రో రైలులో తినడానికి సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వలేదు.

ఓ యూట్యూబర్ (YouTuber) వీడియోలు చేసి వాటిని యూట్యూబ్ లో పెడుతున్నాడు. యూట్యూబర్ చేస్తున్న వీడియోలను చాలా మంది చూస్తున్నారు. అయితే ఆ యూట్యూబర్ (YouTuber) వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు షాక్ అయ్యారు. నమ్మ బెంగళూరు మెట్రో (metro train) అధికారులు ఆ యూట్యూబర్ వెంటపడ్డాడు. చివరికి ఆ యూట్యూబర్ ను పట్టుకున్నారు.
బెంగళూరులో (Bengaluru) నివాసం ఉంటున్న ఓ యూట్యూబర్ ( మెట్రో అధికారులు ఆ యూట్యూబర్ పేరు చెప్పలేదు) బెంగళూరులోని జయనగర ( Jayanagar) నుంచి మల్లేశ్వరంలోని సంపిగే మెట్రో (metro train) రైల్వేస్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించాడు. యూట్యూబర్ తో (YouTuber) పాటు అతని స్నేహితులు అదే సమయంలో మెట్రో రైలులో ప్రయాణించారు.

మెట్రో రైలు (metro train) మల్లేశ్వరంలోని సంపిగే రోడ్డు వైపు వెలుతున్న సమయంలో ఆ యూట్యూబర్ బ్యాగ్ లో నుంచి గోబీ మంచూరి (gobi manchuri) ప్యాకెట్ బయటకు తీసి దానిని తినడం మొదలుపెట్టాడు. మెట్రో రైలులో గోబీ మంచూరి తినడానికి అనుమతిలేదని, ఆ ప్యాకెట్ బ్యాగ్ లో పెట్టాలని ఆ యూట్యూబర్ కు (YouTuber)అతని స్నేహితులు చెప్పారు.
అయితే స్నేహితుల మాటలు ఏమాత్రం పట్టించుకోని ఆ యూట్యూబర్ శుభ్రంగా గోబీ మంచూరి తినేసి ప్యాకెట్ ఖాలీ చేశాడు. మెట్రో రైలులో (metro train) ఆ యూట్యూబర్ గోబీ మంచూరి (gobi manchuri) తింటున్న సమయంలోనే అతని స్నేహితులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న బెంగళూరు (Bengaluru) మెట్రో అధికారులు ఆ యూట్యూబర్ ను వెతికిపట్టుకుని మెట్రో రైలులో గోబీ మంచూరి (gobi manchuri) తిన్నందుకు రూ 500 ఫైన్ వేశారు.

ఇంకోసారి మెట్రో రైలులో (metro train) గోబీ మంచూరినే (gobi manchuri) కాకుండా ఇతర ఆహారపదార్థాలు తింటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ యూట్యూబర్ కు వార్నింగ్ ఇచ్చామని నమ్మ బెంగళూరు మెట్రో రైలు సంస్థ (BMRCL) అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. స్నేహితులు వద్దని చెప్పినా ఆ యూట్యూబర్ మాట వినకుండా గోబీ మంచూరి తిన్నాడని అధికారులు అంటున్నారు.
మెట్రో రైలులో ఆహారపదార్థాలు ఆరగించి ఇతర ప్రయాణికులు ఇబ్బందికి గురికాకూడదని మెట్రో రైలులో ఆహార పదార్థాలు ఆరగించడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. నమ్మ బెంగళూరు (Bengaluru) మెట్రో రైలులో గోబీ మంచూరి (gobi manchuri) తిన్నందుకు ఇదే మొదటిసారి ఓ ప్రయాణికుడికి అపరాదరుసుం విధించడంతో ఆ యూట్యూబర్ (YouTuber) రికార్డు బ్రేక్ చేసి వార్తల్లో నిలిచాడు.












Click it and Unblock the Notifications