వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గడ్‌లో ఎపి విభజన తీరుపై మోడీ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

రాయ్‌గడ్: ఆంధ్రప్రదేశ్ విభజనపై తీరుపై కాంగ్రెసు మీద బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చేపడుతున్న కాంగ్రెసు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఛత్తీస్‌గడ్ ఎన్నికల ప్రచారంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. తన ప్రచార సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవని ఆయన అన్నారు. గతంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డియే పాలనలో ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధమైన హింస కూడా చోటు చేసుకోలేదని, అంత ప్రశాంతంగా రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పుకున్నారు.

Narendra Modi

కాంగ్రెసు ప్రభుత్వానికి తనను లక్ష్యం చేసుకోవడం తప్ప మరో పని కనిపించడం లేదని ఆయన అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కే్ంద్ర ప్రభుత్వం సామరస్యంగా రాష్ట్రాల విభజనను చేపట్టిందని ఆయన కొనియాడారు. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా కాంగ్రెసు రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన అన్నారు.

పేద రాష్ట్రాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్ ఉండేదని, చత్తీస్‌గడ్ విభజన తర్వాత మధ్యప్రదేశ్‌ను చూసి కాంగ్రెసు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గడ్‌ను ఎవరైనా పేద రాష్ట్రమంటారా అని ఆయన అడిగారు. ఒకవేళ విభజన చేస్తే ఛత్తీస్‌గడ్‌లా చేయాలని ఆయన అన్నారు.

English summary
Gujarat CM and BJP PM candiadate Narendra Modi pointed out the lapses in the bifurcation of Andhra Pradesh state in his Cchattisgarh election rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X