తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటముల మధ్య విజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. రెండు కూటముల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైంది. విజయ్ సింగిల్ గా పోటీకి సిద్దమయ్యారు. ఎన్డీఏ పార్టీల మధ్య సీట్లు ఖరారు అయ్యాయి. ఇక్కడే కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. తమిళనాడులోనూ బీజేపీ ఏపీ ఫార్ములా అమలు చేస్తోంది. ఇక ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. దీంతో.. విజయ్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.

PMK 18 సీట్లు, AMMK 11 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా తమిళనాడులో డీఎంకే - అన్నా డీఎంకే కూటముల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. ఈ రెండు కూటముల గెలుపు ఓటములు మధ్య విజయ్ టీవీకే పార్టీ కీలకంగా మారుతోంది. కింగ్ మేకర్ గా మారితే ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. బీజేపీ - అన్నా డీఎంకే ప్రధాన పార్టీలు ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్లు ఖరారయ్యాయి. ఇక్కడ బీజేపీ 27 స్థానాలకే పోటీ చేసేందుకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు మరో ఏడు స్థానాలు అదనంగా దక్కిచుకుంది.

NDA announces seat sharing between the Alliance parties for Assembly Election BJP to contest in 27 seats

సీట్ల పంపకాలు.. విజయ్ వైపే అందరి చూపు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో మాజీ సీఎం పళనిస్వామి చర్చల ఫలితంగా ఈ సీట్లు ఖరారయ్యాయి. ఇప్పుడు కూటమి నేతలు చెన్నై లో అధికారికంగా ప్రకటించారు. ఇకపై కూటమిలో ఏ పార్టీ చేరదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం వరకు విజయ్ ఎన్డీఏతో జత కడతారనే ప్రచారం సాగింది. ఈ మేరకు సీట్లు.. పదవుల ఆఫర్లు తెర మీదకు వచ్చాయి. అన్నాడీఎంకే అభ్యంతరంతో విజయ్ తో పొత్తు ప్రతిపాదన ఆగిపోయింది. ఇక, ఇప్పుడు సీట్ల సర్దుబాటు పూర్తి కావటంతో అసలు గేమ్ మొదలైంది. తాజాగా వస్తున్న సర్వేలకు అనుగుణంగా ఈ సీట్ల పంపకాలకు బీజేపీ అంగీకరంచక తప్పలేదని తెలుస్తోంది. అయితే.. ఇదే ఇప్పుడు ఎన్నిక వేళ కీలక మలుపు తీసుకొనే అవకాశం ఉంది. అటు డీఎంకే.. ఇటు అన్నా డీఎంకే (ఎన్డీఏ) కూటముల సీట్లు సర్దుబాటు దాదాపు పూర్తయింది. ఇదే సమయంలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అటు అన్ని స్థానాల్లో సింగిల్ గా పోటీ చేయాలని విజయ్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తన పార్టీ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసారు. ఈ సమయంలోనే కొత్త ట్విస్టు తెర మీదకు వచ్చింది. రెండు కూటముల్లో సీట్లు ఆశించి భంగపడిన నేతలు విజయ్ వైపు చూస్తున్నారు. అయితే, వారిలో ఎంత మందికి విజయ్ సీట్లు సర్దుబాటు చేస్తారనేది కీలకంగా మారుతోంది. అదే విధంగా ఇక విజయ్ ఎన్డీఏ లో ఎంట్రీ సాధ్యం కాదు. ఎన్డీఏ- డీఎంకే కూటముల్లో సీట్లు రాని వారిని తన వైపు తిప్పుకునేందుకు విజయ్ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తున్నారు.

అయితే.. తన పార్టీ అభ్యర్ధుల విషయంలో విజయ్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కొత్త వారి చేరితో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. బీజేపీ తక్కువ సీట్లకు పోటీ చేయటం.. ద్రవిడ భావజాలంతో.. రెండు జాతీయ పార్టీలతో జత కట్టిన డీఎంకే - అన్నా డీఎంకే పార్టీలకు వ్యతిరేకంగా విజయ్ చేస్తున్న ఈ రాజకీయ పోరు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఈ కీలక వేళ విజయ్ తీసుకునే నిర్ణయాలు ఫలితాల పై ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+