NEET-PG exams: కొత్త తేదీ ఇదే..!!

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG exams) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల కొత్త తేదీ వెల్లడైంది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 11వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించనుందా బోర్డు. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు ఉంటాయి.

నీట్ పీజీ పరీక్షల రద్దుపై పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.

NEET PG exams dates and scheduled has been announced by the NBEMS

నీట్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తోన్నాయి. కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

అప్పట్లో ఆ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నీట్- పీజీ పరీక్షలను వాయిదా వేసింది. కిందటి నెల 23వ తేదీన పరీక్షలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ పరీక్షలు 23వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. 52 వేల వరకు ఉన్న నీట్-పీజీ సీట్ల కోసం రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షలను రాయాల్సి ఉంది. నిమిషం ఆలస్యం అయినా పరీక్షలు రాయనివ్వకపోవడం అనే నిబంధన ఉండటం వల్ల దూర ప్రాంత విద్యార్థులందరూ అప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

ఆ పరిస్థితుల్లో నీట్ పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని వాయిదా వేస్తోన్నట్లు 22వ తేదీన రాత్రి కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఎన్‌బీఈఎంఎస్ కొత్త తేదీ, షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగస్టు 11వ తేదీన రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+