వైద్యుని నిర్ల‌క్ష్యం.. వేలికి బదులుగా చిన్నారి నాలుక‌కు సర్జ‌రీ!

వైద్యుని నిర్ల‌క్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఓ బాలిక చేతి వేలికి చేయాల్సిన స‌ర్జరీని నాలుక‌కు చేశారు. దీంతో ఆ బాలిక మాట్లాడ‌లేని ప‌రిస్థితిలోకి వెళ్లిపోయింది. విష‌యం తెలుసుకున్నఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. దారుణమైన ఈ ఘటన కేరళలోని కోజికోడ్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో త‌ల్లిదండ్రులు వైద్యుల‌ను సంప్ర‌దించారు. అయితే, సర్జరీ ద్వారా ఆ వేలును తొలగించవచ్చని డాక్టర్లు సూచించడంతో త‌మ కుమార్తెను కోజికోడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ డాక్టర్ నిర్ల‌క్ష్యంతో చేతి వేలికి బదులు నాలుకకు స‌ర్జ‌రీ చేశాడు. ఆప‌రేష‌న్ థియేట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చిన ఆ చిన్నారిని చూసిన త‌ల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. ఆ పాప చేతికి ఉండాల్సిన బ్యాండేజ్ కాస్త నోటికి ఉండ‌డంతో ఆ చిన్నారి త‌ల్లితండ్రులు ఖంగుతిన్నారు. వెంట‌నే తేరుకుని ఆసుప‌త్రి సిబ్బందిని, వైద్యుల‌ను అడ‌గ‌గా, నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని చెప్పారు. దీంతో ఆ మాట‌లు విన్న త‌ల్లిదండ్రులు నిర్ఘాంత‌పోయారు.

Negligence of the doctor Surgery for the child s tongue instead of a finger

స్పందించిన ప్ర‌భుత్వం..

ఇక‌, ఈ విష‌యంపై కేర‌ళ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బెజోన్‌ జాన్సన్‌ను సస్పెండ్‌ చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆమె అధికారుల‌ను ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా, బాలిక త‌ల్లిదండ్రుల‌ ఫిర్యాదు మేరకు పోలీసులు డాక్టర్ జాన్సన్‌పై కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, జరిగిన పొరపాటు తెలుసుకున్న వైద్యులు ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌కు క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని వారికి చెప్పారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఇక‌, ఈ విష‌యంపై బాలిక త‌ల్లిదండ్రులు మాట్లాడుతూ.. వైద్యుని నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాటుతో కుమార్తెకు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఆసుపత్రే బాధ్యత వహించాలి అని అన్నారు. వైద్యుడు చేసిన పొర‌పాటుకు క్షమాపణ చెప్పారని త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+