మరో వివాదంలో బీజేపీ: నెహ్రూ వీకిపీడియా పేజీ ఎడిట్

న్యూఢిల్లీ: సుష్మా, రాజే వివాదాలతో ఇప్పటికే సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం మెడకు మరో వివాదం చుట్టుకుంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వీకీపిడియాలోని మొదటి పేజీని ఎడిట్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఐపీ అడ్రస్‌తో ఎవరో జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పేజీలను ఎడిట్ చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణధీవ్ సూర్జీవాలా మీడియాతో మాట్లాడారు.

Nehru's Wikipedia pages altered from GoI IP address: Congress

మాజీ ప్రధాని ముస్లిం అని, వాస్తవానికి నెహ్రూ బ్రిటిషర్ అని వీకీపీడియాలోని మొదటి పేరాలోనే పేర్కొన్నారని ఆరోపించారు. ఆ తర్వాత దీనిని వీకీపీడియా ఎడిటర్లు తొలగించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నెహ్రూ హిందువా, ముస్లిమా? అన్నద అప్రస్తుతమని, ఆయన భారతీయుడని రణధీవ్ సూర్జీవాలా స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్పందనను తెలియజేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+