కేంద్ర నిధుల్లో భారీగా కోత?: బిగ్ ఫైట్
PM Modi government: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై తమిళనాడు సర్కార్.. మరోసారి విరుచుకుపడింది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో వివక్షను ఎదుర్కొనాల్సి వస్తోందంటూ ఆరోపణలు సంధించింది.
బీజేపీయేతర, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధుల్లో కేంద్రం ఉద్దేశపూరకంగా భారీగా కోత పెడుతోందంటూ స్వయానా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ విమర్శించారు. దీనికి సంబంధించి ది హిందూ ప్రచురించిన ఓ ప్రత్యేక కథనాన్ని ఉటంకించారు.

దేశంలో అన్ని రంగాల్లోనూ అత్యుత్తమంగా నిలిచిన రాష్ట్రాలకు సైతం కేంద్ర నిధులు ఆశించినంతగా విడుదల కావట్లేదని, కేటాయింపుల్లో కోత పడుతోందంటూ ఇటీవలే హిందూ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఐటీ, ఆటోమొబైల్, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటోన్న తమిళనాడుకు కూడా దానికి తగ్గట్టుగా కేంద్ర నిధులు అందట్లేదని వివరించింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి సేకరించిన వివరాలతో కూడిన నివేదిక ఆధారంగా ఈ కథనాన్ని రాసుకొచ్చింది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయని రాష్ట్రాలపై విడుదల చేయాల్సిన సమగ్ర శిక్షా అభియాన్ నిధుల్లో కేంద్రం కోత పెడుతోందని పేర్కొంది. పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచింది.
దీనికి సంబంధించిన ఓ క్లిప్‌ను ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయని రాష్ట్రాలకు నిధులను మంజూరు చేయడం కేంద్రానికి ఎంతమాత్రం కూడా ఇష్టం లేదని, ఉద్దేశపూరకంగా కోత పెడుతోందంటూ స్టాలిన్ విమర్శించారు.
Denying funds to the best-performing states for refusing to bow to the #NEP, while generously rewarding those who are not delivering on the objectives – Is this how the Union BJP Government plans to promote quality education and equity?
— M.K.Stalin (@mkstalin) September 9, 2024
I leave it to the wisdom of our nation… pic.twitter.com/6whhTjD3bG
జాతీయ విద్యా విధానం, పీఎం శ్రీ స్కూల్ పాలసీని అమలు చేయని రాష్ట్రాలకు సమగ్ర శిక్ష అభియాన్ కింద మంజూరు చేయాల్సిన నిధుల్లో కోత పెట్టడం వల్ల సమాన విద్య అందుతుందా? అంటూ నిలదీశారు. ఉత్తమ పనితీరు కనపరుస్తోన్నప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాలకు నిధులను నిరాకరించడాన్ని కేంద్రం విజ్ఞతకే వదిలేస్తోన్నానని అన్నారు.












Click it and Unblock the Notifications