MH Elections: వారసులకే సీట్లు- సీనియర్ల పాట్లు..!!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ప్రధాన కూటమి పార్టీలు తమ అభ్యర్దులను ప్రక్రియ దాదాపు పూర్తి చేస్తున్నాయి. మిత్రపక్షాల బలాల పైనే బీజేపీ, కాంగ్రెస్ ఆధారపడ్డాయి. ఇదే సమయంలో ఈ సారి మహారాష్ట్రలో అన్ని పార్టీల్లోనూ వారసుల ఎంట్రీకి రూటు క్లియర్ చేస్తున్నారు. సీనియర్లు తమ వారసులకు సీట్ల కోసం ఒత్తిడి చేసి మరీ సాధిస్తున్నారు. దీంతో, సీటు ఆశించిన ఆ నియోజకవర్గాల సీనియర్లకు షాక్ తప్పటం లేదు. పలు పార్టీల నుంచి సీట్ల కేటాయింపులో ఫ్యామిలీ ప్యాక్ లు అమలవుతున్నాయి.
వారసులకే ప్రాధాన్యత
మహారాష్ట్రలో వారసులకు సీట్లు పెద్ద సంఖ్యలో సీట్లు దక్కుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా సీన్లు కనిపిస్తున్నాయి. సీటు తమకు ఖాయమనే నమ్మకంతో పార్టీలో పని చేసిన వారిలో ఆగ్రహం మొదలైంది. దాదాపు అన్ని పార్టీల్లోని సీనియర్లు తమ రక్త సంబంధీకులకే ప్రధానంగా సీట్లు కేటాయించారు. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహిల్యా నగర్ స్థానం బరిలోకి దిగారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే వర్లి నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు వరుణ్ సర్దేశాయ్ తూర్పు బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

పార్టీలు మారినా
మాజీ సీఎం అశోక చవాన్ కుమార్తెకు బీజేపీ భోకర్ స్థానం కేటాయించింది. ముంబై బీజేపీ అధినేత ఆశిష్ షేలర్ పశ్చిమ బాంద్రా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన సోదరుడు వినోద్ షేలర్‌ను పశ్చిమ మలాడ్ నియోజకవర్గంలో పోటీకి దిగారు. రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ సోదరుడు కిరణ్ సామంగ్‌కు శిందే శివసేన రాజాపూర్ సీటు నుంచి బరిలోకి దింపుతోంది. శ్రీగొండ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే బాబన్‌రావ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో, అక్కడి నుంచి ఆయన భార్య ప్రతిభా పచ్‌పూతేను బీజేపీ ఎంపిక చేసింది. ఇక, కాంకావ్లి నియోజకర్గ ఎమ్మెల్యే నితేశ్ సోదరుడు నీలేశ్ ఇటీవల బీజేపీ నుంచి ఉద్ధవ్ శివసేనలో చేరగా.. ఆయనకు పార్టీ కుడాల్ నియోజవర్గాన్ని కేటాయించింది.
ఫ్యామిలీకే ప్రాధాన్యత
ఎన్సీపీ నేత పంకజ్ భుజ్‌బల్ నాసి క్ జిల్లాలోని యోలా నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు చాగన్ భుజ్‌బల్ ఇండిపెండెంట్‌గా అదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఎంపీలు సందీపన్ భూమరే, రవీంద్ర వైకర్ తమ వారికి సీట్లు దక్కించున్నారు. భూమరే కుమారుడు విలాస్.. పైథాన్ నియోజకవర్గం నుంచి, వైకర్ భార్య మనీశా తూర్పు జోగేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా.. ఈ సారి ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో గెలుపు దక్కేదెవరికి అనేది కూడా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications