అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో వింత.. ప్రత్యక్షమైన కొత్త మొసలి!!

సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉంటాయి. ఇక హిందూ దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన, ఎంతో మహిమాన్వితమైన, ఎన్నో వింతలకు కేంద్ర బిందువైన ఆలయాలు కూడా ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ముఖ్యమైనది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనం నమ్మలేని ఎన్నో వింత విషయాలు ఉన్నాయి. అటువంటి వింతలలో పద్మనాభ స్వామి దేవాలయంలోని కొలను ఒకటి.

ఈ కొలనులో ఆలయ అధికారులు, సిబ్బందికి ప్రమేయం లేకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఒక మొసలి వచ్చి ఉంటుంది. భక్తులకు ఎవరికి హాని చేయని శాకాహార మొసలి ఈ కొలనులో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలలో ఇది ముఖ్యంగా చెప్పదగినది. గతంలో ఈ కొలనులో బబియా అనే ఒక మొసలి ఉండేది. ఆ మొసలి పండ్లు పలహారాలు తప్ప మరేమీ తినేది కాదు.

 new crocodile found in Anantha Padmanabha Swamy temple pool!!

గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. ఇది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేది ఎవరూ చెప్పలేరు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి ప్రత్యక్షం కావడం ఎంతోకాలంగా అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో జరుగుతుంది.

ఇప్పటివరకు మూడు మొసళ్ళు అదేవిధంగా కనిపించాయి. గత ఏడాది చనిపోయిన బబియా మొసలి మూడవది. తాజాగా కనిపించినది నాలుగవ మొసలి. ఒకప్పుడు ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని, బ్రిటిష్ వాళ్ళు దాన్ని కాల్చేయడంతో దాని స్థానంలో మరో మొసలి వచ్చిందని, ఆ తరువాత బబియా, ఇప్పుడు మరో మొసలి కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఈ కొలనులో ఇంకా మొసళ్ళు ఉన్నాయా? ఒకటి చనిపోయిన తర్వాత మాత్రమే ఇంకొకటి ఎందుకు కనిపిస్తుంది? ఇదంతా అనంత పద్మనాభుడి లీలనా అని అక్కడికి వచ్చిన భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ సీక్రెట్ వెనుక అసలు కారణం ఏమిటి? అనేది అందరూ చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+