ఒక సిటీలో 46 రైల్వేస్టేషన్లు... మనదేశంలోనే..!
ఏదైనా నగరంలో ఒకటి లేదంటే రెండు రైల్వేస్టేషన్లు ఉంటాయి. కానీ ఈ నగరంలో మొత్తం ఏకంగా 46 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అంతేకాదు.. అది మనదేశంలోనే ఉంది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 46 రైల్వేస్టేషన్లు ఉన్నాయనే విషయం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా రైళ్లు ఎంపిక చేసిన స్టేషన్లకే వెళుతుంటాయి. ఢిల్లీలోని స్టేషన్లను రైల్వేశాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. A1 కేటగిరీలో 4 రైల్వే స్టేషన్లు, A కేటగిరీలో 4 రైల్వే స్టేషన్లు ఉండగా, మైనర్ కేటగిరీలో 38 స్టేషన్లు ఉన్నాయి.
A1 కేటగిరీలోకి వచ్చే స్టేషన్లు
ఆనంద్ విహార్ టెర్మినల్, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ
A కేటగిరీలోకి వచ్చే స్టేషన్లు
ఆదర్శ్ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరాయ్ రోహిల్లా, ఢిల్లీ షాహ్దారా స్టేషన్

మైనర్ కేటగిరీలోకి వచ్చే స్టేషన్లు:ఆజాద్ పూర్, బద్లీ, బిజ్వాసన్, బ్రార్ స్క్వేర్, చాణక్యపురి, దయాబస్తీ, ఢిల్లీ ఇంద్రపురి, ఢిల్లీ కిషన్ గంజ్, ఢిల్లీ సఫ్దర్ జంగ్, ఘేవ్రా, గోకుల్ పురి సబోలి హాల్ట్, హోలంబి కలాన్, ఖేదా కలాన్, కీర్తినగర్, లజపత్ నగర్, లోథి కాలనీ, మండవాలి చంద్రవిహార్, మంగోల్ పురి, ముండ్కా, నంగ్లోయ్, నారాయణ విహార్, నరేలా, ఓఖ్లా, పాలం, పటేల్ నగర్, ప్రగతి మైదాన్, సదర్ బజార్, సర్దార్ పటేల్ మార్గ్, సరోజినీ నగర్, సేవానగర్, షహాబాద్ మహ్మద్ పూర్, షకుర్బస్తీ, శివాజీ బ్రిడ్జ్, సబ్జీమండి, తిలక్ వంతెన, తుగ్లకాబాద్, వివేకానందపురి, వివేక్ విహార్.
వీటితోపాటు 13 స్టేషన్లు అప్ గ్రేడ్ చేశారు. వీటిని సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్ల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లలో చాలావరకు గూడ్స్ రైళ్లు లేదంటే లోకల్ రైళ్లను వినియోగిస్తున్నారు. మొత్తం 46 స్టేషన్లలో 13 స్టేషన్లను జనవరిలో అప్ గ్రేడ్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.












Click it and Unblock the Notifications