Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటి ఓనర్‌లకు హెచ్చరిక: అద్దె పెంచాలంటే 3 నెలల ముందే చెప్పాలి!

ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పలు ఆన్‌లైన్ వేదికలపై 'న్యూ రెంట్ రూల్స్ 2026' పేరుతో కొన్ని నిబంధనలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఈ నియమాలు అద్దెదారులు, ఇంటి యజమానుల మధ్య ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తాయని, అద్దె నివాస మార్కెట్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేస్తాయని పేర్కొంటున్నారు. అయితే, ఈ 2026 నిబంధనలుగా వైరలైన అంశాలలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రతిపాదించిన 'మోడల్ టెనెన్సీ యాక్ట్' (MTA) లోనివే. భారతదేశంలో అద్దె చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి కాబట్టి, కేంద్రం కేవలం ఒక 'నమూనా చట్టాన్ని' మాత్రమే ఇచ్చింది. దాన్ని అమలు చేయాలా వద్దా అనేది రాష్ట్రాల ఇష్టం.

ప్రచారంలో ఉన్న నిబంధనల ప్రకారం, అన్ని అద్దె ఒప్పందాలను 60 రోజులలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. ఇలా చేయని పక్షంలో జరిమానాలు విధిస్తారు. ఇక సెక్యూరిటీ డిపాజిట్ల విషయంలో అద్దెదారులకు పెద్ద ఊరట లభించనుంది. నివాస గృహాలకు కేవలం రెండు నెలల అద్దెను మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవాలని, వాణిజ్య అవసరాలకు ఆరు నెలల వరకు తీసుకోవచ్చని ఈ నిబంధనలు చెబుతున్నాయి. పెద్ద నగరాల్లో యజమానులు 10 నెలల వరకు డిపాజిట్ అడుగుతున్న తరుణంలో, ఈ నిబంధన అద్దెదారులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Renting a House in 2026 Know the New Rules for Security Deposits Rent Hikes and Digital Agreements

Rent పెంపుపై కీలక మర్గదర్శకాలు..

అద్దె పెంపు విషయంలో యజమానులకు కఠిన నిబంధనలు విధించారు. ఒప్పందం కుదిరిన 12 నెలల తర్వాతే అద్దె పెంచాలని, అది కూడా 90 రోజుల ముందే లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే, యజమాని తన ఇంటిని తనిఖీ చేయాలనుకుంటే అద్దెదారుకు కనీసం 24 గంటల ముందే నోటీసు ఇవ్వాలి. దీనివల్ల అద్దెదారుల గోప్యతకు భంగం కలగదు. ఒకవేళ ఇంట్లో ఏదైనా పెద్ద మరమ్మతు అవసరమైతే, అద్దెదారు చెప్పిన 30 రోజులలోపు యజమాని స్పందించాలి. లేనిపక్షంలో అద్దెదారే స్వయంగా మరమ్మతులు చేయించుకుని, ఆ ఖర్చును అద్దెలో నుంచి తగ్గించుకోవచ్చు.

వేగవంతమైన వివాద పరిష్కారం

అద్దె చెల్లించకపోవడం లేదా ఇంటిని ఖాళీ చేయించడం వంటి వివాదాలు సివిల్ కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగకుండా, ప్రత్యేకంగా 'రెంటల్ ట్రిబ్యునల్స్' ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. ఈ ట్రిబ్యునళ్లు 60 రోజులలోపు కేసులను పరిష్కరించాలి. యజమానులు బలవంతంగా అద్దెదారులను ఖాళీ చేయించడం, నీరు లేదా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులవుతారు. ఇవి అద్దెదారులకు రక్షణ కల్పిస్తూనే, యజమానులకు కూడా తమ ఆస్తిపై స్పష్టమైన హక్కులను కల్పిస్తాయి.

రాష్ట్రాల వారీగా అమలులో వ్యత్యాసాలు

అయితే, ఈ నిబంధనలన్నీ దేశవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి రాలేదు. అస్సాం, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ మోడల్ చట్టాన్ని తమకు అనుగుణంగా మార్చుకుని అమలు చేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పాత అద్దె చట్టాలే ఎక్కువగా కొనసాగుతున్నాయి. అలాగే, ఆధార్ వివరాలను అద్దె ఒప్పందాలకు తప్పనిసరి చేయడం వంటి అంశాలపై కొన్ని గోప్యతా ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్ ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురికాకుండా, మీ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె చట్టం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+