నెక్ట్స్ సీడీఎస్‌గా నరవణే..? ప్రకటించడమే తరువాయి.. మళ్లీ ఆర్మీ నుంచే
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతితో.. ఆ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఆయన వారసుడిగా తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన సీడీఎస్ పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టనుంది.

వచ్చే ఐదు నెలల్లో ఆర్మీ చీఫ్‌గా రిటైర్ కానున్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెను ప్రభుత్వం సీడీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని పలువురు రిటైర్డ్ మిలిటరీ అధికారులు అంటున్నారు. తదుపరి సీడీఎస్ నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లోని సీనియర్ కమాండర్లతో కమిటీని ఏర్పాటు చేయనుందని సమాచారం. రెండు, మూడు రోజుల్లో త్రివిధ దళాధిపతుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఈ కమిటీ తుది పేరు ఖరారు చేస్తుంది. అటుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదానికి పంపుతారు.
సీడీఎస్ నియామకంపై రక్షణ మంత్రి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాల చెబుతున్నాయి . తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో వివాద పరిష్కారంలో పనితీరు ఆధారంగా తదుపరి సీడీఎస్‌గా ఎంఎం నరవణె నియమితులయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో ఆయన ఆర్మీ చీఫ్‌గా వైదొలగనున్నారు.
బిపిన్ రావత్‌తో పాటు మృతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరగనున్నాయి. తమిళనాడులోని కూనూర్‌లో హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్వాడ్రన్ లీడర్ కే సింగ్, జేడబ్ల్యూఓ దాస్, ప్రదీప్, సత్పాల్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయితేజ మరణించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications