వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్లు జరిపాం, జరుపుతాం: పశ్చాత్తాపంలేని భత్కల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

NIA arrestes Bhatkal's aide Imam
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లు, వాటి వల్ల సంభవించిన మరణాల పట్ల తనకు ఏమాత్రం బాధ, పశ్చాత్తాపం లేదని హైదరాబాద్ జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు భత్కల్ చెప్పాడు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసుకు సంబంధించి భత్కల్, అసదుల్లా అక్తర్‌లను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

భత్కల్ తాను చేసిన నేరాలను ఏకరువు పెడుతూనే, వాటి పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని చెబుతున్నాడు. భత్కల్, అసదుల్లా ఇద్దరు కూడా అదే జవాబిస్తుండటంతో విచారణాధికారులు ఖంగుతింటున్నారు. అంతేకాకుండా అలాంటి నేరాలు మళ్లీ చేస్తామని చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకే వీరు పేలుళ్లకు పాల్పడుతున్నారు. పేలుళ్లకు పాల్పడింది తామేనని, ఇంకా పేలుళ్లు జరుపుతామని, తమ లక్ష్య సాధన కోసం ఏమైనా చేస్తామని, అందులో తమకు తప్పు కనిపించడం లేదని చెప్పారు.

భత్కలు అనుచరుడికి 15 రోజుల కస్టడీ

యాసిన్ భత్కల్ అనుచరుడు మహ్మద్ మంజేర్ ఇమామ్‌ను మంగళవారం ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించి తాజా కేసులో ఢిల్లీ కోర్టు అనుమతి మేరకు అతనిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అతనికి జిల్లా న్యాయస్థానం పదిహేను రోజుల కస్టడీ విధించింది.

English summary

 IM co founder Yasin Bhatkal's close aide Mohd Manzar Imam was arrested in a fresh case by the NIA inside a Delhi court in connections with terror strikes across the counrty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X