Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'నయాగరా' ఆఫ్ సౌత్ ఇండియా.. బాహుబలి షూటింగ్ జరిగింది ఇక్కడే.. ఎలా వెళ్లాలి..?

నయాగరా ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుపొందిన అతిరప్పిల్లి వాటర్ ఫాల్స్ దేశవ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి ప్రకృతి అందాలు దేవుడి సృష్టిగా అభివర్ణిస్తుంటారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ జలపాతం ఉంది. కేరళలోనే అతి పెద్ద జలపాతంగా దీనికి పేరుంది. చాలకుడి నదిపై ఈ వాటర్ ఫాల్స్ ఏర్పడింది. పర్యటకులను, ప్రకృతి ఔత్సాహికులను ఈ జలపాతం ఆకర్షిస్తోంది.

అతిరప్పిల్లి వాటర్ ఫాల్స్ దేశంలోనే ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా ఉంది. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశానికి దేశ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చాలకుడి నదిపై ఏర్పడిన ఈ జలపాతం దాదాపు 80 అడుగుల ఎత్తు నుండి నీరు జాలువారుతుంది. పశ్చిమ కనుమల అడుగున ఉన్న ఈ ప్రదేశం పచ్చని అడవుల అందాల మధ్య ఉంది. ఈ జలపాతాన్ని దక్షిణ భారత నయాగరా అని పర్యటకులు పిలుచుకుంటారు. ఈ ప్రాంతంలోనే బాహుబలి సినిమా షూటింగ్ చేశారు. బాహుబలి పార్ట్ 1 లోని చాలా సన్నివేశాల్లో ఈ జలపాతం క్లారిటీగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఈ జలపాతం మరింత ఫేమస్ అయింది.

Niagara of the South Discovering Athirappilly s Majestic Falls

పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల మధ్యలో ఈ అతిరప్పిల్లి జలపాతం ఉంటుంది.
వర్షాకాలం తర్వాత ఈ జలపాతం మరింత ప్రకృతి రమణీయంగా, అందంగా కనువిందు చేస్తుంది. అందుకే పర్యటకులు వర్షాకాలం తర్వాత ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు.
వర్షాకాలం తర్వాత సందర్శించడం ఉత్తమంగా నిపుణులు చెబుతున్నారు. కేరళలోనే అతిపెద్ద జలపాతంగా దీనికి పేరుంది. అతిరప్పిల్లి జలపాతం చేరుకున్న పర్యటకులకు దగ్గరలోనే వళచల్ అనే మరో జలపాతం కూడా ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ సౌకర్యం కూడా ఉంది. అతిరప్పిల్లి జలపాతం వ్యూ పాయింట్ చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు.

ఎలా చేరుకోవాలి..?

అతిరప్పిల్లి జలపాతానికి చేరుకోవాలంటే ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో చలక్కుడి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ కు చేరుకోవచ్చు. అలాగే ఈ జలపాతానికి దగ్గరలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే ఈ జలపాతానికి 55 కిలోమీటర్ల దూరంలో త్రిసూర్ నగరం ఉంది. త్రిసూర్ నుంచి చలక్కుడికి బస్సలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+