Omicron అలర్ట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ రేపట్నుంచి నైట్‌కర్ఫ్యూ

లక్నో: మనదేశంలోనూ కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన పలు ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం(డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు కానుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

 Night Curfew In Uttar Pradesh From December 25 As Omicron Cases Rise.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. భారీ సభలను నిర్వహిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున జనాలను గుమిగూడటం జరుగుతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలువురు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు, యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ ఉధృతి దృష్ట్యా యూపీతోపాట పలు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేగాక, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని కోరింది. అయితే, కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ప్రకటన చేసింది.

కాగా, ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచే ఆంక్షలు అమలవుతున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇక ఢిల్లీ, కర్ణాటక ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా జనం గుమిగూడకూడదని స్పష్టం చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం వేడుకలను నిషేధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+