నీరవ్ మోడీకి ద్వంద్వం పౌరసత్వం: 'భారత్ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం'
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో నిందితుడు నీరవ్ మోడీని భారత్‌కు తీసుకు వచ్చి, చట్టం ముందు నిలబెడతామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్ల వెల్లడించారు.
రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని పరిష్కరించేందుకు పీఎంవోతో తమ శాఖ చర్చిస్తోందన్నారు. పీఎంఓ తీసుకొనే నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఇదిలా ఉండగా, నీరవ్ మోదీకి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈడీ సూచనల మేరకు నీరవ్, అతని బంధువు మెహుల్ ఛోక్సిల పాస్‌పోర్టులను విదేశీ వ్యవహారాలశాఖ నాలుగు వారాల పాటు రద్దు చేసింది.

అయితే, నీరవ్ అతని సోదరుడు నిషాల్ బెల్జియంలో పెరిగారనీ, వారికి ఆ దేశ పౌరసత్వం కూడా ఉండొచ్చని ది ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.
నీరవ్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు పలానీపురీ జైన్ సామాజికవర్గానికి తెలుసునని ఆ కథనంలో పేర్కొంది. నిషాల్ భారత పాస్‌పోర్టును స్వాధీనపరచి, బెల్జియం పౌరసత్వం పొందాడనీ, నీరవ్ మాత్రం తాను భారతీయ పౌరుడినని ప్రకటించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications