బీజేపీ బిగ్ బాస్ గా రాష్ట్ర మంత్రి- ఏరికోరి సెలక్షన్
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నియమితులయ్యారు. ప్రతిష్ఠాత్మక ఈ పదవి కోసం బిహార్ మంత్రి నితిన్ నబిన్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పార్టీ ప్రకటించింది. ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
నితిన్ నబిన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. బాంకీపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. కొత్తగా ఆవిర్భవించిన ఈ నియోజకవర్గానికి 2010లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో నితిన్ నబీన్ విజయం సాధించారు. ఇప్పటివరకు ఓటమి అనేదే చవి చూడలేదు.

2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 51,000 ఓట్లకు పైగా మెజారిటీతో ప్రత్యర్థిని ఓడించారు. పార్టీ అగ్ర నాయకత్వ నిర్మాణంలో బీజేపీ భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. ఈ క్రమంలో నితిన్ నబీన్ నియామకం చోటు చేసుకుంది. జనవరి 2020లో జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన జేపీ నడ్డా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలతో సహా కీలక సందర్భాల్లో పార్టీకి సారథ్యం వహించడానికి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది బీజేపీ పార్లమెంటరీ పార్టీ. నితిన్ నబిన్‌కు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. దివంగత బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడాయన. తండ్రి మరణం తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా నితిన్ నబీన్ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంతో పాటు, సంస్థాగతంగానూ నితిన్ నవీన్‌కు విస్తృతమైన అనుభవం ఉంది. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్లమెంటరీ కమిటీ.. నితిన్ నబీన్ కు అత్యంత కీలకమైన పార్టీ జాతీయ పగ్గాలను అందించడానికి మొగ్గు చూపింది. ఆయనను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
-
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications