ఢిల్లీలో నితిన్ నవీన్ హవా: కేంద్ర కేబినెట్ విస్తరణకు వేళాయె!

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి జాతీయాధ్యక్షుడిగా నితిన్ నవీన్ మంగళవారం(జనవరి 20, 2026) బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న ఆయన.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

యువతకే పెద్దపీట: 55 ఏళ్ల లోపు వారికే ప్రాధాన్యం!
నితిన్ నవీన్ ఏర్పాటు చేయబోయే కొత్త టీమ్‌లో యువ రక్తం ఉరకలెత్తనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ పగ్గాలను యువ నేతకు అప్పగించిన నేపథ్యంలో కొత్త కార్యవర్గంలో మెజారిటీ నాయకులు 55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారే ఉంటారు. 2029 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాతి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సిద్ధాంతాల్లో రాటుదేలిన వారు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే యువ నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కనున్నాయి.

Nitin Naveen Effect in Delhi BJP Gears Up for Cabinet Expansion and Youth Push

మోదీ కేబినెట్‌లోనూ మార్పుల సంకేతాలు?
పార్టీ సంస్థాగత మార్పులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో చాలామంది 2021 నుంచి పదవుల్లో కొనసాగుతున్నారు. వారి పనితీరు ఆధారంగా కొందరిని తప్పించి, యువకులకు అవకాశం ఇచ్చే యోచనలో ప్రధాని ఉన్నట్లు సమాచారం. సుమారు డజను మంది మంత్రులు ప్రస్తుతం రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల పని భారం పెరుగుతోందని భావిస్తున్న అధిష్టానం, కొత్తవారికి చోటు కల్పించాలని చూస్తోంది.

ఈ ఏడాది సుమారు 70 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో బీజేపీ నుంచి సుమారు 33 మందిని పంపే అవకాశం ఉంది. దీంతో సీనియర్లను రాజ్యసభకు పంపి, యువ నేతలను ప్రభుత్వంలోకి లేదా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది.

సవాళ్లు, సమయం:
నితిన్ నవీన్ టీమ్‌లో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు వంటి సీనియర్లను ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద సవాలుగా మారింది. సీనియర్ నేతలకు ఉపాధ్యక్ష లేదా ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎవరికీ అసంతృప్తి కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున, తుది జాబితా రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. మొత్తానికి నితిన్ నవీన్ రాకతో బీజేపీలో సరికొత్త అధ్యాయం మొదలవ్వడమే కాకుండా, 2029 సమరానికి ఇప్పటి నుంచే యువ సేనను సిద్ధం చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+