Bihar: ఊసరవెల్లిని మించిపోయిన నితీశ్ రాజకీయం-మళ్లీ బీజేపీతో కలిసి సీఎం పదవిలోకి..!

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఈసారి కూడా మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ కే అధికారం దక్కొచ్చన్న అంచనాల మధ్య నిన్న మొన్నటివరకూ కలిసి ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చిన విపక్షాలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. ముఖ్యంగా గతంలో పలుమార్లు బీజేపీతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఇప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి యూపీఏ సర్కార్ నడుపుతున్న నితీశ్ కుమార్.. తాజా పరిణామాలతో మరోసారి యూటర్న్ తీసుకున్నారు.

బీహార్లో కుల గణన చేపట్టి బీసీల్ని పూర్తిగా తమవైపుకు తిప్పుకున్నానని భావించిన నితీశ్ కుమార్ కు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నట్లు తేలడంతో రూటు మార్చేశారు. వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని మిత్రపక్షం ఆర్జేడీకి ప్రతిపాదించారు. కానీ ఆర్జేడీ నో చెప్పడంతో ఆ పార్టీని వదిలించుకుని తిరిగి బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు.

nitish kumar Chameleon politics in bihar, all set to replace partner rjd with bjp

ఇవాళ గవర్నర్ ను కలిసిన నితీశ్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈసారి బీజేపీకి గతంలోలాగే రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్ని ఆఫర్ చేసేందుకు నితీశ్ సిద్దమవుతున్నారు. తాను మాత్రం సీఎం పదవిలోనే కొనసాగుతానని బీజేపీకి తేల్చిచెప్పేశారు. ముందు నితీశ్ సీఎం పదవి వదులుకోవాలని చెప్పిన బీజేపీ.. చర్చల తర్వాత ఆ పదవి వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏడోసారి సీఎం అయ్యేందుకు నితీశ్ కుమార్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరోవైపు నితీశ్ దూరమైనా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఓ ఎంఐఎం ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉన్న ఆర్జేడీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా, కూటమిని నడిపించే స్ధాయిలో ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 సీట్లకు రెండు సీట్ల దూరంలో ఉండిపోతోంది. దీంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేల సాయం లభిస్తే ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని నలుగురు ఎమ్మెల్యేల హెచ్ఏఎమ్ మద్దతు తీసుకుని ఆ పార్టీకి డిప్యూటీ సీఎం ఆఫర్ చేస్తున్నారు. అయితే వీరి చేరిక తర్వాత కూడా ప్రభుత్వం కొనసాగాలంటే మరో ఇద్దరు తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+