బీహార్ సీఎం పదవిపై తేల్చేసిన బీజేపీ, ఇక నెక్స్ట్..!!

బీహార్ లో సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారైంది. ఎన్డీఏ భారీ మెజార్టీతో గెలుపు.. బీజేపీ అధిక సీట్లు గెలవటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చర్చగా మారింది. అయితే, 2027 వరకు వరుసగా పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు.. రాష్ట్రపతి ఎలక్షన్ తో పాటుగా బీహార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ తమ నిర్ణయం వెల్లడించింది. అదే సమయం లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.

బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఖరారయ్యారు. బీజేపీతో మిత్రపక్షాల సుదీర్ఘ చర్చల తరువాత తిరిగి నితీశ్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని నిర్ణయించారు. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 సీట్లతో జయభేరి మోగించింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌)కి 19, హెచ్‌ఏఎం 5 , ఆర్‌ఎల్‌ఎస్‌పీ 4 సీట్లలో విజయం సాధించాయి. ఇప్పటి వరకూ బీహార్‌ సీఎంగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ఉన్నారు. అయితే, తాజా ఫలితాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో నితీశ్‌ కుమార్‌ను తప్పించి కమలం పార్టీకి చెందిన నేతను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బీహార్‌ బీజేపీ చీఫ్‌ స్పష్టతనిచ్చారు. నితీశ్‌ కుమారే సీఎంగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ జైస్వాల్‌ స్పష్టం చేసారు.

nitish-kumar-is-set-to-be-sworn-in-as-the-bihar-chief-minister-on-nov-20

ఇక, బీజేపీ శానసభా పక్షం రేపు ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలమంలో తన నాయకుడిని ఎన్నుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఎన్డీయే శానసభా పక్షం సమావేశమై నితీశ్ ను సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తుందని వెల్లడించారు. కాగా, ఈనెల 20న బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా నితీశ్‌ కుమారు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీతోపాటూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు తెలిసింది. ఇక.. నితీశ్ కేబినెట్ లో బీజేపీ.. ఎల్జేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీశ్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు అసలు సవాల్ గా మారనుంది. అయితే.. బీజేపీ మాత్రం భవిష్యత్ వ్యూహాలను పరిగణలోకి తీసుకొని నితీశ్ కు మద్దతు ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+