వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య కేసులో ఇరుక్కున్నావ్: నితీష్‌పై లాలూ తీవ్రవ్యాఖ్యలు

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ పైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ పైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కూడా ఒకప్పుడు ఓ హత్య కేసులో ఇరుక్కున్నారని మండిపడ్డారు. ఆయుధాల కేసులోను ఆరోపణలున్నాయన్నారు.

చదవండి: ట్విస్ట్, లాలు ఉలిక్కిపాటు: మళ్లీ నితీషే సీఎం? బయటి నుంచి బిజెపి మద్దతు

తన ప్రాణం పోయినా ఇక బిజెపితో కలవనని తనకు చాలాసార్లు నితీష్ చెప్పారని ఎద్దేవా చేశారు. తాను నిన్న రాత్రి కూడా నితీష్‌తో 40 నిమిషాలు మాట్లాడానని చెప్పారు. నితీష్ రాజీనామా చర్య సరైనది కాదన్నారు.

Nitish Kumar resigns as Bihar CM, PM Modi praises move, Lalu hits back

తన కొడుకు తేజస్వి యాదవ్ పైన ఆరోపణలు ఇది కొత్త కాదన్నారు. గతంలోను వచ్చాయన్నారు. దర్యాఫ్తు సంస్థలకు తాము వివరాలు ఇస్తామని చెప్పారు. నితీష్‌కు ఇవన్నీ ముందే తెలియవా అని ధ్వజమెత్తారు. బిజెపి, ఆరెస్సెస్‌తో నితీష్ కలిశారని అర్థమవుతోందని, ఎందుకంటే రాజీనామా చేయగానే మోడీ ట్వీట్ చేశారని లాలూ అన్నారు. శాసన సభలో తమ పార్టీయే పెద్దది అని, తమ పార్టీ అభ్యర్థి సీఎం అవుతారని చెప్పారు.

చదవండి: ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది: నితీష్ సంచలనం, ప్రశంసించిన మోడీ

కాగా, పాలనలో నితీష్ కుమార్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని లాలూ గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు నితీష్ వ్యాఖ్యలతో అది వాస్తవం కాదని తెలుస్తోంది. బిజెపి మధ్యంతర ఎన్నికల కంటే నితీష్‌ను మళ్లీ సీఎం పదవిలో కూర్చోబెట్టడమే బెట్టర్ అని భావిస్తోంది.

English summary
Nitish Kumar has resigned as the chief minister of Bihar, hours after Rashtriya Janata Dal (RJD) president Lalu Prasad Yadav ruled out resignation by his son and deputy chief minister Tejaswi Yadav from the RJD-Janata Dal (United) alliance government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X