Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'బెగ్గింగ్' వద్దు: రాజ్యసభలో మరోసారి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: బెగ్గింగ్ అనే పదాన్ని ఉపయోగించవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి సూచించారు. రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్గింగ్‌ అనే పదాన్ని ఉపయోగించొద్దని శుక్రవారం మళ్లీ గుర్తుచేశారు.

కేంద్రమంత్రి పీపీ చౌదరి సభలో మాట్లాడుతూ.. ఐ బెగ్‌ అన్నారు. వెంటనే ఆయన మంత్రికి బెగ్‌ అనే పదాన్ని ఉపయోగించొద్దని సూచించారు. కేవలం పత్రాలను ప్రవేశపెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలని బెగ్‌ అనే పదాన్ని వాడొద్దన్నారు.

No begging please: Rajya Sabha chairman Venkaiah Naidu reminds ministers

ఆ పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదన్నారు. ఆ తర్వాత చౌదరి మాట్లాడేపుడు బెగ్‌ పదాన్ని ఉపయోగించలేదు. దీనిపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కూడా ఆయన ఇదే సూచన చేశారు.

ఇప్పటివరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్‌ టు అని పలికేవారు. అది విన్న ఆయన ఆ పదాన్ని వాడొద్దని సూచించారు. అది వలసవాదానికి నిదర్శనమని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+