వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రద్దుచేసిన నగదు డిపాజిట్‌కు నో ఛాన్స్

రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రద్దుచేసిన పాత నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించే అవకాశం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారంనాడు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు మరోసారి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి సూచించింది. అయితే ఈ సూచనను కేంద్రం తోసిపుచ్చింది.. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్ చేసుకొనేందుకు ఎలాంటి అవకాశం కల్పించబోమని కేంద్రం ప్రకటించింది.

no chance to banned notes to deposit

రద్దైన రూ.500, రూ. 1000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ఆఖరి అవకాశంగా వెసులుబాటు కల్పిస్తే డిమానిటైజేషన్ అసలైన ఉద్దేశ్యం నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన యుద్దం నిష్ప్రయోజనంగా మారుతోందని కేంద్రం అభిప్రాయపడింది.

సహేతుక కారణాలు తెలిపినవారికి డిపాజిట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. తగిన కారణాలు చూపినవారికి ఇబ్బందులు సృష్టించకూడదని కూడ సలహ ఇచ్చింది.గతంలోనే అనేక దుర్వినియోగాలు చోటుచేసుకొన్న విషయాన్ని కేంద్రం సుప్రీంకు తెలిపింది. మరోసారి అవకాశం కల్పిస్తే బినామీ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రం పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నోట్ల డిపాజిట్ల గడువు కూడ విధించింది. అయితే ఈ గడువు సరిపోలేదు. గడువు పెంచాలని కూడ వినతులు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఈ సూచన చేసింది.

English summary
One last opportunity to deposit the 500- and 1,000-rupee notes that were banned in November will defeat the whole point of demonetisation as well as the battle against black money, the government told the Supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X