Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకే నో చెప్పేసిన అజీమ్ ప్రేమ్ జీ..! బెంగళూరు జామ్ అంతేనా ?

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజధాని బెంగళూరులో గుంతల రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో గుంతల రోడ్లపై ట్రాఫిక్ వేగంగా కదలకపోవడంతో జామ్ లు నిత్యకృత్యమవుతున్నాయి. దీంతో జనంలో అసహనం పెరుగుతోంది. దీంతో రోడ్ల మరమ్మత్తుల్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ పెట్టిన ప్రభుత్వం.. ఆలోపు
ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం విప్రో క్యాంపస్ లో నుంచి వాహనాల్ని అనుమతించాలని ఆ సంస్ధను కోరింది.

ఈ మేరకు సీఎం సిద్దరామయ్య విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్ జీకి లేఖ రాశారు. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. బయటి వాహనాల్ని తమ సర్జాపూర్ క్యాంపస్ గుండా ప్రయాణించేందుకు ప్రేమ్ జీ తిరస్కరించారు. నిర్దిష్ట అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ, సవాళ్లపై ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడానికి విప్రో సిద్దంగా ఉన్నట్లు ఆయన సీఎం సిద్దరామయ్యకు తెలిపారు. రాష్ట్ర అధికారులతో తదుపరి చర్చలను సమన్వయం చేయడానికి ఆయన సీనియర్ కంపెనీ ప్రతినిధి రేష్మి శంకర్‌ను నియమించారు.

No Relief for Bengaluru Traffic Azim Premji Rejects Karnataka CM s Request

బెంగళూరులో ట్రాపిక్ సమస్య తీవ్రతను తాము గుర్తిస్తున్నట్లు ప్రేమ్ జీ అంగీకరించారు. అలాగే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్పొరేట్ మద్దతు కోసం సిద్ధరామయ్య చేసిన విజ్ఞప్తిని ప్రశంసించారు. అయితే సర్జాపూర్‌లోని క్యాంపస్‌ను ప్రత్యేక ఆర్థిక జోన్ గా ఏర్పాటు చేశారని, దాని ప్రపంచ సేవా నిబద్ధతల కారణంగా కఠినమైన యాక్సెస్ నియంత్రణ నియమాలకు కట్టుబడి ఉందని విప్రో చైర్మన్ గుర్తుచేశారు.

No Relief for Bengaluru Traffic Azim Premji Rejects Karnataka CM s Request

తమ సర్జాపూర్ క్యాంపస్ ప్రజా రవాణా కోసం ఉద్దేశించబడని లిస్టెడ్ కంపెనీ యాజమాన్యంలోని ప్రత్యేకమైన ప్రైవేట్ ఆస్తి కాబట్టి, మేము గణనీయమైన చట్టపరమైన, పాలన, చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కుంటున్నట్లు ప్రేమ్ జీ వెల్లడించారు. తమ క్యాంపస్ ప్రపంచవ్యాప్త కస్టమర్లకు సేవలను అందించే సెజ్ అని, తమ ఒప్పంద నిబంధనలు పాలన, సమ్మతి కోసం కఠినమైన, చర్చించలేని యాక్సెస్ నియంత్రణ నిబంధనలను తప్పనిసరి చేస్తాయని తెలిపారు. అంతేకాకుండా, ప్రైవేట్ ఆస్తి ద్వారా ప్రజా వాహనాల కదలిక స్థిరమైన, దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రభావవంతంగా ఉండదని తేల్చేశారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి దీర్ఘకాలిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ, నిపుణుల నేతృత్వంలోని అధ్యయనం అవసరమని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+