కుక్కల కోసం పెళ్లి చేసుకోని మీనా..

చెన్నై : మూగజీవాలపై అమితమైన ప్రేమను పెంచుకుని వాటి మధ్యే గడిపేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే.. కేవలం మూగజీవాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా త్యజించే వ్యక్తులెవరైనా ఉంటారా?. చెన్నైలోని లాలా తొట్టం కాలనీలో నివాసముంటోన్న మీనాను చూస్తే.. అవును అని సమాధానం చెప్పాల్సిందే.

కేవలం మూగజీవాల కోసం పెళ్లిని సైతం త్యాగం చేసి.. వచ్చే అరకొరా జీతంలో 17 కుక్కులను పెంచుతోంది మీనా. పెళ్లి చేసుకుంటే.. వచ్చే భర్త వాటిని ఎక్కడ వదిలిపెట్టమంటాడోనన్న భయంతో.. పెళ్లి జోలికే పోలేదట మీనా. 17 కుక్కలను పెంచుతుందంటే.. ఆమె ఐదారంకెల జీతం వచ్చే వ్యక్తి అయి ఉండవచ్చు అనుకోవడం సహజం. కానీ, ఆమె ఇరుగు పొరుగిళ్లలో అంట్లు తోమే పనిచేస్తోంది.

No way she will give up her dogs for a husband

తనకు వచ్చే ఆ కొద్దిపాటి జీతంతోనే 17కుక్కలను పెంచి పోషిస్తోంది. పెంచడమంటే.. వూరకే తిండి పెట్టడం మాత్రమే కాదు, వాటి ఆరోగ్యంపై కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది మీనా. ఏ కుక్క కాస్త అనారోగ్యంగా కనిపించినా.. వెంటనే వెటర్నరీ డాక్టర్ వద్దకు పరిగెడుతుంది. వాటిని విడిచిపెట్టి ఎటైనా వెళితే.. ఎక్కడ.. ఒకదానితో మరొకటి కొట్లాడుకుంటాయోనని ఆమె అసలు ఎక్కడికి వెళ్లడం కూడా మానేసింది మీనా.

వాటి ఆలనా-పాలనా చూడడం తన జీతానికి మించిన భారమే అయినా.. బాధ్యతతో ఇవన్నీ చేస్తున్నానని చెబుతోంది మీనా. రెండు గదుల చిన్న ఇంట్లో ఇన్నేసి కుక్కలతో 17ఏళ్లుగా నివాసముంటోంది మీనా. ప్రస్తుతం మీనా వయసు 36 ఏళ్లు కాగా, భవిష్యత్తులో కూడా పెళ్లికి దూరం అంటూ ఖరా ఖండికి చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+